Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో ఒమిక్రాన్‌ వేరియంట్ బిఎ4 తొలి కేసు?

Webdunia
శుక్రవారం, 20 మే 2022 (07:58 IST)
హైదరాబాదులో ఒమిక్రాన్‌కి చెందిన సబ్ వేరియంట్ బిఎ 4 తొలి కేసు నమోదైంది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బిఎ4 ఈ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఆఫ్రికా నుంచి వచ్చిన సదరు వ్యక్తితో కాంటాక్టులోకి వచ్చిన వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. 
 
ఈ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బిఏ4 కేసు గురించి ఇప్పటి వరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 
 
ఆఫ్రికాకు చెందిన వ్యక్తి హైదరాబాద్‌కి రాగా.. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో జరిపిన వైద్య పరీక్షల్లో అతడికి ఈ సబ్ వేరియంట్ సోకినట్టు సమాచారం. అయితే, అతడికి లక్షణాలు లేకపోవడంతో తిరిగి ఈనెల 16వ తేదీనే అతడు ఆఫ్రికా వెళ్లిపోయాడు.
 
ఆఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తిలో గుర్తించినది ఒమిక్రాన్‌కి సబ్ వేరియంట్ బిఎ 4 అవునో కాదో అనే విషయం నిర్ధారించుకునేందుకు అతడి శాంపిల్స్‌ని ఇండియన్ సార్స్-కొవిడ్ 2 కన్సార్టియం ఆన్ జెనోమిక్స్ (ఇన్సాకోగ్)కి పంపించారు. 
 
ప్రస్తుతం కన్సార్టియం నుంచి నివేదిక రావాల్సి ఉంది. కన్సార్టియం నుంచి అధికారిక ప్రకటన వెలువడితే కానీ ఈ సబ్‌వేరియంట్ కేసుపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెకానిక్ రాకీ నుంచి రామ్ మిరియాల పాడిన ఐ హేట్ యూ మై డాడీ సాంగ్

రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ లతో రామాయణం పార్ట్ 1,2 ప్రకటించిన నితేష్ తివారీ

ప్రముఖ దర్శకుడిపై జితేందర్ రెడ్డి హీరో రాకేష్ వర్రే ఫైర్

పాట్నా వేదికగా "పుష్ప-2" ప్రమోషన్ ఈవెంట్?

నా బరువు గురించి మీకెందుకయ్యా... నెటిజన్‌పై సమంత ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయలను ఎవరు తినకూడదు? ఎందుకు తినకూడదు?

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments