దళితుల కోసమే కొత్త రాజ్యాంగం కావాలంటున్నాను : సీఎం కేసీఆర్

Webdunia
ఆదివారం, 13 ఫిబ్రవరి 2022 (20:42 IST)
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 యేళ్లు గడుస్తున్నా దళితులు ఇంకా పేదరికంలోనే మగ్గుతున్నారని, ఆ దళితుల కోసమే రాజ్యాంగాన్ని మార్చాలని తాను కోరుతున్నానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అందుకోసమే కొత్త రాజ్యాంగం రాయాలని కోరుతున్నానని చెప్పారు. 
 
దళితులకు 19 శాతం రిజర్వేషన్ల కోసం, ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కు కోసం కొత్త రాజ్యాంగం రావాలని కోరుతున్నానని తెలిపారు. భారతదేశం అమెరికా కన్నా గొప్ప ఆర్థికశక్తిగా ఎదిగేందుకు కొత్త చట్టం, కొత్త స్ఫూర్తి రావాలని సీఎం కేసీఆర్ అభిలషించారు. 
 
కేంద్రం రాష్ట్రాల హక్కులను కాలరాస్తోంది... దీన్ని అడ్డుకునేందుకు కొత్త రాజ్యాంగం రాయాలి అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలా భారతదేశం కూడా మారాలన్న ఉద్దేశంతోనే రాజ్యాంగాన్ని మార్చాలని అంటున్నానని స్పష్టం చేశారు.
 
ఎన్నికలు వచ్చినప్పుడల్లా సరిహద్దుల్లో డ్రామాలు చేస్తుంటారని, ఈ తరహా రాజకీయాలకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. అసోం సీఎం వ్యాఖ్యల నేపథ్యంలోనే తాను రాహుల్ గాంధీ విషయం మాట్లాడానని, తాను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడంలేదని కేసీఆర్ స్పష్టం చేశారు. 
 
కర్నాటక రాష్ట్రంలో ఉత్పన్నమైన హిజాబ్ వివాదంపైనా కేసీఆర్ స్పందించారు. ఈ వివాదంపై ప్రధానితో పాటు దేశం మొత్తం మౌనం వహిస్తోందని.. అంతర్యుద్ధం చెలరేగితే దేశం గతేంటని నిలదీశారు. కర్ణాటక పరిస్థితి దేశ వ్యాప్తంగా వస్తే పరిస్థితి ఏంటన్నారు. 
 
బీజేపీ విద్వేషపూరిత మత రాజకీయాల గురించి యువత ఆలోచించాలని సీఎం కేసీఆర్ సూచించారు. దేశ యువత మధ్య ఎందుకు విద్వేషాలు రగులుస్తున్నారని నిలదీశారు. శాంతిభద్రతలు కోరుకుందామా? ఘర్షణలు, కర్ఫ్యూలు కోరుకుందామా? అనేది యువత ఆలోచించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంతారా ఎఫెక్ట్.. టాలీవుడ్ హీరోల కళ్లపై కునుకు లేకుండా చేస్తోన్న రిషబ్ శెట్టి?

కపుల్ ఫ్రెండ్లీ నా కెరీర్ లో గుర్తుండిపోయే మూవీ అవుతుంది :సంతోష్ శోభన్

ది ఇండియా హౌస్ తో తెలుగులో ఎంట్రీ ఇస్తున్న కంపోజర్ శాశ్వత్ సచ్‌దేవ్

Nabha Natesh: మహాశివరాత్రికి మైథలాజికల్ యాక్షన్ డ్రామా నాగబంధం టీజర్

అలాంటి బుర్ర వున్నవాడితో పిల్లల్ని కంటే కష్టమే, అందుకే వదిలేసా: మృణాళ్ ఠాకూర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

హైదరాబాదులో PMJ Jewels హాఫ్ శారీస్, పెళ్లి వేడుకల నగల డిజైన్ల ప్రదర్శన

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ

హైదరాబాద్‌ ఐఆర్‌ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments