Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్టీలో ఉంటారా? పోతారా? స్పష్టం చేయండి : రేవంత్ రెడ్డికి రమణ సూటిప్రశ్న

తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎల్.రమణ నుంచి అనూహ్య ప్రశ్న ఎదురైంది. పార్టీలో ఉంటారా? పోతారా? ఏదో ఒకటి స్పష్టం చేయాలంటూ నిలదీశారు. దీంతో శుక్రవారం

Webdunia
శుక్రవారం, 20 అక్టోబరు 2017 (12:41 IST)
తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎల్.రమణ నుంచి అనూహ్య ప్రశ్న ఎదురైంది. పార్టీలో ఉంటారా? పోతారా? ఏదో ఒకటి స్పష్టం చేయాలంటూ నిలదీశారు. దీంతో శుక్రవారం హైదరాబాద్ వేదికగా జరుగుతున్న టీ టీడీపీ పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ సమావేశం హాట్‌హాట్‌గా సాగుతోంది. 
 
టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బంజారాహిల్స్‌లోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో టీటీడీపీ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగగా, అంచనాలను తలకిందులు చేస్తూ రేవంత్ రెడ్డి వచ్చారు. ఆయన్ను చూడగానే పలువురు అభిమానులు ఎదురెళ్లి స్వాగతం పలికారు. 
 
నవ్వుతూ లోపలికి వచ్చి వర్కింగ్ కమిటీ సమావేశానికి వెళ్లిన రేవంత్‌ను, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ కాస్తంత గట్టిగానే నిలదీసినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు వచ్చిన వార్తల గురించి ప్రస్తావించిన ఆయన, అసలేం అనుకుంటున్నారో నిజం చెప్పాలని నిలదీసినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 
 
పార్టీ మారాలని భావిస్తే, అసలు ఈ సమావేశానికి రాకుండా ఉండాల్సిందని కూడా ఆయన అన్నట్టు సమాచారం. ఇక తాను పార్టీ మారుతున్నట్టు ఎన్నడైనా, ఎక్కడైనా చెప్పానా? అని ఎల్.రమణను ఎదురు ప్రశ్నించిన రేవంత్, కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో టీడీపీ విఫలమవుతోందని ఆరోపించినట్టు సమాచారం. మొత్తంమీద ఈ సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరుకావడం ఇపుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments