Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 18 April 2025
webdunia

వైఎస్సార్ సెంటిమెంట్‌ను బలంగా నమ్ముతున్న రేవంత్ రెడ్డి.. వైఎస్సార్‌కు సబితక్క-నాకు సీతక్క?!

రాజకీయ నేతలకు సెంటిమెంట్లు ఎక్కువనే విషయం తెలిసిందే. తెలంగాణ రాజకీయాల్లో అలాంటి సెంటిమెంట్ల విషయంలో సీఎం కేసీఆర్ అగ్రస్థానంలో ఉన్నారు. వాస్తు ప్రకారం సచివాలయాన్ని మార్చడం వంటివి చేస్తూ కేసీఆర్ వార్తల్

Advertiesment
Inside : TDP MLA Revanth Reddy follows KCR and YSR
, మంగళవారం, 22 నవంబరు 2016 (10:47 IST)
రాజకీయ నేతలకు సెంటిమెంట్లు ఎక్కువనే విషయం తెలిసిందే. తెలంగాణ రాజకీయాల్లో అలాంటి సెంటిమెంట్ల విషయంలో సీఎం కేసీఆర్ అగ్రస్థానంలో ఉన్నారు. వాస్తు ప్రకారం సచివాలయాన్ని మార్చడం వంటివి చేస్తూ కేసీఆర్ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కేసీఆర్ తరహాలో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా సెంటిమెంట్ బాట పట్టారని తెలుస్తోంది. 
 
వాస్తు ప్రకారం సెక్రటేరియట్ నిర్మాణానికి కేసీఆర్ ప్లాన్ చేస్తే.. దీనిపై విపక్షాలు భగ్గుమన్నాయి. అయితే ఈ విషయాన్ని పక్కనబెడితే.. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా సెంటిమెంట్లను బాగా నమ్ముతున్నారని తెలిసింది. 
 
రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితం పెద్దమ్మతల్లి దేవాలయం నుంచి సైకిల్‌పై పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఇక పై ఏ కార్యక్రమమైనా పెద్దమ్మతల్లి ఆశీస్సులతో చేపడతానని ప్రకటించారు. దివంగత నేత పి జనార్థన్ రెడ్డి అప్పట్లో పెద్దమ్మ తల్లి సెంటిమెంట్‌ను బలంగా నమ్మేవారు. ఇకపై ఆ సెంటిమెంట్‌ను కొనసాగించడానికి రెడీ అయ్యారు రేవంత్.
 
నాడు వైఎస్ రాజశేఖర్‌ రెడ్డికి కలిసొచ్చిన సెంటిమెంటే తనకూ కలిసొస్తుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. 2003లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా చేవేళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అప్పట్లో సబితా ఇంద్రారెడ్డి ఆయనకు ఇలాగే కుంకుమతో బొట్టుపెట్టి యాత్రను ప్రారంభింపజేశారు. ఆ తర్వాత ఎన్నికల్లో వైఎస్ ఘన విజయం సాధించారు. 
 
అప్పటినుంచి సబితను చెల్లెమ్మగా వైఎస్సార్ ఆదరించారు. అచ్చంగా ఇదే సెంటిమెంట్‌ను రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నారు. "నాడు వైఎస్ కు సబితక్కలా... నేడు తనకు సీతక్క" ఎదురొచ్చి యాత్ర ప్రారంభింపజేశారని ఈ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని బహిరంగ సభలోనే రేవంత్ భావిస్తున్నారు. మరి ఈ సెంటిమెంట్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జపాన్‌లో భారీ భూకంపం... రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రత... సునామీ హెచ్చరికలు