Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అంతా మీరు చేసి మమ్మల్ని అంటే న్యాయమా బాబుగారూ? టీటీడీపీ నేతల గుర్రు

మంత్రివర్గ విస్తరణపై గవర్నర్‌ వైఖరి తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబును ఇరుకున పెట్టింది. దీంతో ఆయన తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలపై ఈ నెపాన్ని నెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఇటీవల జరిగిన సీనియర్‌ నేతల సమావేశంలో చంద

అంతా మీరు చేసి మమ్మల్ని అంటే న్యాయమా బాబుగారూ? టీటీడీపీ నేతల గుర్రు
హైదరాబాద్ , గురువారం, 2 మార్చి 2017 (07:06 IST)
ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించడానికి గవర్నర్ నరసింహన్ ససేమిరా అన్నట్లు అత్యంత విశ్వసనీయవర్గాలు తెలిపాయి. దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు, వారిని రాష్ట్ర మంత్రివర్గంలో చేర్చుకోవాలని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు గవర్నర్‌ నరసింహన్‌ గట్టి షాకిచ్చారు.

మంత్రివర్గ విస్తరణపై గవర్నర్‌ వైఖరి తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబును ఇరుకున పెట్టింది. దీంతో ఆయన తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలపై ఈ నెపాన్ని నెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఇటీవల జరిగిన సీనియర్‌ నేతల సమావేశంలో చంద్రబాబు పరోక్షంగా దీనికి సంబంధించి వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. 
 
ప్రతిదానికీ న్యాయస్థానాలకు వెళ్లడం మంచిది కాదని తలసాని మంత్రిపదవి వివాదాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ చంద్రబాబు అన్నట్లు పార్టీ సీనియర్‌ నేత ఒకరు చెప్పారు. తలసాని వ్యవహారంలో అధినేత చంద్రబాబు చెప్పినట్టే చేశామని, ఆయన చెప్పబట్టే కోర్టుల్లో కేసులు వేశామని, ఇప్పుడు ఆయనే మమ్మల్ని తప్పుపడుతున్నారని ఆనేత వ్యాఖ్యానించారు. 
 
ఒక ఎమ్మెల్సీని గెలిపించుకోవడానికి నామినేటెడ్‌ ఎమ్మెల్యేకు డబ్బులివ్వబోయి పట్టుబడి, తెలంగాణలో పార్టీ ఉనికిని ప్రశ్నార్థకం చేసిన చంద్రబాబు మాట మార్చడాన్ని ఇక్కడి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటుకు కోట్లు కేసు వల్ల పార్టీని పాడే మీదకు తీసుకెళ్లి ఇప్పుడు ఆ పని తామేదో చేసినట్లు మాట్లాడుతున్నారని వారు చంద్రబాబుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుంటే రాజ్‌భవన్‌కు రాలేరు: గవర్నర్ ఝలక్