8న తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై ప్రమాణ స్వీకారం

Webdunia
గురువారం, 5 సెప్టెంబరు 2019 (08:36 IST)
తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్‌గా నియమితులైన తమిళిసై సౌందర రాజన్‌ ఈ నెల 8న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర ఎస్‌.చౌహాన్‌ ఆదివారం ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, సీనియర్‌ అధికారులు పాల్గొననున్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి తమిళిసై రెండో గవర్నర్, తొలి మహిళా గవర్నర్‌ కాబోతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా కొత్త గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్‌ నియామకాన్ని ప్రకటిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ జారీ చేసింది.

ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుత గవర్నర్‌ నరసింహన్‌ ఈ నెల 7న బాధ్యతల నుంచి వైదొలగనున్నారు.

మరోవైపు కేంద్ర మాజీమంత్రి, బీజేపీ సీనియర్‌ నాయకుడు బండారు దత్తాత్రేయ ఈ నెల 11వ తేదీన హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments