గురువు కూడా అంతే.... శిష్యుడిని సురక్షితంగా ఒడ్డున పడవేస్తాడు...

Webdunia
బుధవారం, 4 సెప్టెంబరు 2019 (22:33 IST)
గురుర్ బ్రహ్మ గురుర్విష్ణుః 
గురుర్దేవో మహేశ్వరః
గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ
తస్మైశ్రీ గురవే నమః
 
గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, గురువే సాక్షాత్తు ఆదిబ్రహ్మ అటువంటి గురుదేవులకు నమస్కరిస్తున్నాను. కొండ మీద బావి తవ్వినట్లయితే..... వందల కొద్ది అడుగులు తవ్వినా నీళ్లు పడకపోవచ్చు. ఏటి ప్రక్కన ఒకట్రెండు అడుగులు తవ్వగానే జలధార పొంగుకు రావచ్చు. అలానే గురువు సమక్షంలో మనలోని సద్గుణాలు నైపుణ్యాలు త్వరగా బయటకు వస్తాయి.
 
పాలల్లో ఎన్ని పాలు పోసినా తోడుకోదు. చిటికెడు పెరుగు కలిపితేనే తోడుకుంటుంది. గురువు కూడా ఆ పెరుగు లాంటి వాడే. మన జీవితానికి ఒక అర్దాన్ని ప్రసాదిస్తాడు. శిష్యుడిని సన్మార్గంలో పెట్టడానికి, సద్గురువుకు కొన్నిసార్లు కఠినంగానూ వ్యవహరిస్తారు. గురుదృష్టి కూర్మదృష్టి లాంటిది. తాబేలు ఓ చోట గుడ్లు పెట్టి తన దారిన తాను వెళ్లిపోతుందట. కానీ, బలమైన అంతర్ దృష్టిలో..... అక్కడెక్కడో ఉన్న గుడ్లను పిల్లలను పొదిగేస్తుందట. సద్గురువూ అంతే. శిష్యుడు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా గురువుకు మనసంతా శిష్యుడి మీదే ఉంటుంది.
 
గురుశిష్య సంబంధానికి తొలిదశలో మర్కటకిశోర న్యాయం వర్తిస్తుంది. పిల్లకోతి తల్లికోతిని గట్టిగా పట్టుకుంటుంది. కొండలు దాటుతున్నా, గుట్టలు దాటుతున్నా ఆ పట్టు వదలదు. శిష్యడు కూడా గురువును అంతే బలంగా విశ్వసించాలి. మలిదశలో మర్జాలకిశోర న్యాయం వర్తిస్తుంది. పిల్లి తన పిల్లలను ఎలాంటి గాయాలు కాకుండా....... చాలా జాగ్రత్తగా తన పళ్లతో పట్టుకుని రకరకాల గమ్యాలకు తరలిస్తుంది. గురువు కూడా అంతే.... శిష్యుడిని సురక్షితంగా ఒడ్డున పడవేస్తాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుసగా రూ.100 కోట్ల చిత్రాలు.. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీతో ప్రదీప్‌కు కలిసొస్తుందా?

Lokesh Kanagaraj: ఈ ఏడాదిలోనే అల్లు అర్జున్, లోకేష్ కనకరాజ్ చిత్రం షూటింగ్

Dhanush: ధనుష్ కారాలోని కన్నమ్మా ఎన్ కన్నమ్మ పాట 1 మిలియన్ వ్యూస్ దాటింది

Ramya Krishna: అల్లు అర్జున్.. రాకా లో రమ్యక్రిష్ణ - ఏడు విదేశీ భాషలలో విడుదలకు సన్నాహాలు

Thiruveer: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ ల చిత్రం ఓ..! సుకుమారి షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తమ కొత్త ప్రచారానికి రుక్మిణి వసంత్‌ను ఎంచుకున్న తనిష్క్

ఊబకాయం: అద్దంలో కనిపించే లావు కాదు, అడుగడుగునా పొంచి ఉన్న ఆరోగ్య సంక్షోభం

హెచ్చరిక: అందరి దృష్టిని ఆకర్షించేలా తన లేటెస్ట్ కలెక్షన్‌ను రూపొందించిన మోచీ

UP Woman Scripts History: ఖాట్మండు నుంచి ఎవరెస్ట్ వరకు సైకిల్ యాత్ర.. దివ్య సింగ్ రికార్డ్ (video)

మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments