Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హరీష్ రావు ముఖ్యమంత్రి కావాలని 1016 కొబ్బరికాయలు కొట్టాడు...

Advertiesment
హరీష్ రావు ముఖ్యమంత్రి కావాలని 1016 కొబ్బరికాయలు కొట్టాడు...
, బుధవారం, 4 సెప్టెంబరు 2019 (16:24 IST)
సిద్ధినేట ఎమ్మెల్యే మాజీ మంత్రి, హరీష్ రావు ముఖ్యమంత్రి కావాలని కోరుతూ గద్వాల జిల్లా జోగులాంబ అమ్మవారి ఆలయంలో ఆయన మద్దతుదారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వనపర్తి జిల్లా చందాపూర్‌కు చెందిన చింతకుంట విష్ణు అనే వ్యక్తి అమ్మవారికి 1,016 టెంకాయలు మొక్కు సమర్పించాడు. హరీష్ రావు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించాడు. 
 
హరీష్ రావు మంచి ప్రజాదరణ ఉన్న నేత అనీ, తెలంగాణ ప్రజలు అందరూ హారీష్ రావును ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నారని నేడు కాకపోయినా.. భవిష్యత్‌లో అయినా హరీష్ రావు ముఖ్యమంత్రి అవుతాడని ధీమా వ్యక్తం చేశాడు. తెలంగాణలో నియంత పాలన కొనసాగుతుందని, కేవలం కొడుకు కేటీఆర్ కోసం కేసీఆర్ చాలామందిని అణచివేస్తున్నారని ఆరోపించారు. 
 
డూడూ బసవన్నలు మాదిరిగా కొడుకు అడుగులకు మడుగులు ఒత్తే నేతలను మాత్రమే కేసీఆర్ అందలం ఎక్కిస్తున్నారని విష్ణు ఆరోపించారు. త్వరలోనే మంచిరోజులు రానున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు హారీష్ రావు అభిమానులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రయాణికుడిని చితకబాది 2 లక్షలు యూకె కరెన్సీ అపహరించిన క్యాబ్ డ్రైవర్