Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేటీఆర్‌కు రామోజీరావు లేఖ.. తండ్రిని మించిన తనయుడు కావాలి!

Webdunia
శుక్రవారం, 23 జులై 2021 (23:51 IST)
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖామంత్రి కేటీఆర్.. జులై 23న తన 45 పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ నేపథ్యంలోనే ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు కేటీఆర్ పుట్టిన రోజు సందర్బంగా లేఖ రాశారు. 
 
ఈ లేఖలో కేటీఆర్ గురించి రాసుకొచ్చారు.. అరుదైన నాయకత్వ లక్షణాలు, అసాధారణ సంభాషణా నైపుణ్యం, అన్నింటికి మించిన రాజకీయ చతురతతో అనతి కాలంలోనే పరిణతి గల నాయకుడిగా ఎదిగి తెలంగాణ రాజకీయ యవనికపై వెలుగులీనుతున్న మీకు 45వ పుట్టిన రోజు శుభాకాంక్షలు, ఆశీస్సులు అని తన లేఖలో పేర్కొన్నారు. ఒక ఉన్నతశ్రేణి నాయకుడికి కావల్సిన లక్షణాలన్నీ మూర్తీభవించిన మీ పనితీరు నేను ఆది నుంచి గమనిస్తూనే ఉన్నాను.
 
మీరు సాధిస్తున్న పురోగతిని చూసి గర్విస్తున్నాను. అని రామోజీరావు తన లేఖలో పేర్కొన్నారు. తన బిడ్డ తండ్రిని మించిన తనయుడు కావాలని ప్రతిబిడ్డ కోరుకుంటారు.. తెలంగాణ అభివృద్ధికి మీరు చేస్తున్న నిరంతర కృషి నాన్నగారి ఆకాంక్షలకు అనుగుణంగా సాగుతూ ఆయనకు అమితానందాన్ని ఇస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. మీ వంటి చైతన్యశీలుడిని పుత్రునిగా పొందిన ఆయన ధన్యులు అని పేర్కొన్నారు రామోజీరావు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments