Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం... 9 మంది గల్లంతు

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (09:17 IST)
శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్యానల్ సర్క్యూట్‌లో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రస్తుతం ఈ విద్యుత్ కేంద్రం తెలంగాణ రాష్ట్ర పరిధిలోని టీఎన్‌జెన్‌కో ఆధీనలో ఉంది. 
 
నాగర్ కర్నూలు జిల్లా, అమ్రాబాద్ మండలం, దోమలపెంట శ్రీశైలం ఎడమ గట్టు పాతాళగంగ వద్ద ఉన్న జల విద్యుత్ కేంద్రంలో ఈ భారీ అగ్రి ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ విధుల్లో నిమగ్నమైవున్నవారిలో దాదాపుగా పది మందివరకు గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం సహాయక సిబ్బంది గాలిస్తున్నారు. 
 
కాగా, అగ్నిప్రమాదం జరిగిన సమయంలో 17 మంది వరకూ లోపల ఉన్నారని తెలుస్తోంది. ప్యానల్ సర్క్యూట్‌లో తొలుత మంటలు చెలరేగాయని అంటున్నారు. ప్రమాదం తర్వాత 8 మంది బయటకు పరుగులు తీయగా, డీఈ శ్రీనివాస్, ఏఈ సుందర్, ఉద్యోగులు మోహన్, కుమార్, సుష్మా, ఫాతిమా, వెంకట్ రావు, రాంబాబు, కిరణ్‌ల కోసం గాలిస్తున్నట్టు ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ సిబ్బంది వెల్లడించారు. 
 
ఈ విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి, మంటలను అదుపు చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ విప్ గువ్వల బాలరాజు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలముకుని ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments