Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 22 ప్యాసింజర్ రైళ్లు మాయం...

Webdunia
గురువారం, 30 సెప్టెంబరు 2021 (08:22 IST)
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తిరిగే ప్యాసింజర్ రైళ్లు క్రమంగా కనుమరుగైపోతున్నాయి. తాజాగా 22 ప్యాసింజర్ రైళ్ళను ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మార్చింది. అలాగే, ఎక్స్‌ప్రెస్ రైళ్లను సూపర్ ఫాస్ట్ రైళ్లుగా మారుస్తూ దక్షణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. మొత్తంగా 22 ప్యాసింజర్ రైళ్లను ఎక్స్‌ప్రెస్‌లుగా, 6 ఎక్స్‌ప్రెస్ రైళ్లను సూపర్‌ఫాస్ట్‌లుగా మారుస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. శుక్రవారం నుంచి ఇది అమల్లోకి రానుంది. 
 
సూపర్ ఫాస్ట్ రైళ్లుగా మార్చిన రైళ్ళ వివరాలు... 
సికింద్రాబాద్ - మణుగూరు, నర్సాపూర్ - నాగర్‌సోల్, కాచిగూడ - మంగళూరు సెంట్రల్, సికింద్రాబాద్ - రాజ్‌కోట్, కాకినాడ టౌన్ - భువనేశ్వర్, సికింద్రాబాద్ - హిస్సార్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు సూపర్‌ఫాస్ట్ రైళ్లుగా మారాయి.
 
ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మారిన ప్యాసింజర్ రైళ్ళు...
కాజీపేట - సిర్పూరు టౌన్, సిర్పూరు టౌన్ - కాజీపేట, సిర్పూరు టౌన్ - భద్రాచలం రోడ్, భద్రాచలం రోడ్ - సిర్పూరు టౌన్, గుంటూరు - నర్సాపూర్, నర్సాపూర్ - గుంటూరు, హైదరాబాద్ దక్కన్ - పూర్ణ, పూర్ణ - హైదరాబాద్ దక్కన్, హైదరాబాద్ దక్కన్ - ఔరంగాబాద్, ఔరంగాబాద్ - హైదరాబాద్ దక్కన్, నాందేడ్ - తాండూరు, తాండూరు - పర్బని, విజయవాడ - కాకినాడ పోర్టు, కాకినాడ పోర్టు - విజయవాడ, విశాఖపట్టణం - కాకినాడ పోర్టు, కాకినాడ పోర్టు - విశాఖపట్టణం, గూడూరు - విజయవాడ, విజయవాడ - గూడూరు, గుంటూరు - కాచిగూడ, కాచిగూడ - గుంటూరు, రాయచూరు - కాచిగూడ, కాచిగూడ - రాయచూరు మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లను ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చారు. శుక్రవారం నుంచి ఈ రైళ్లకు సంబంధించి కొత్త టైం టేబుల్ అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

తర్వాతి కథనం
Show comments