Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తింటి వేధింపులకు అల్లుళ్ళు బలి...

అత్తింటి వేధింపులకు అబల బలి.. ఇలాంటి టైటిల్ చూసుంటాం.. కానీ అత్తింటి వేధింపులకు అల్లుళ్ళ బలి అని సాధారణంగా విని ఉండం. కానీ అలాంటిదే జరిగింది. ఇద్దరు యువకులు అత్తింటి వేధింపులు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన సంఘటన

Webdunia
శనివారం, 23 జూన్ 2018 (21:43 IST)
అత్తింటి వేధింపులకు అబల బలి.. ఇలాంటి టైటిల్ చూసుంటాం.. కానీ అత్తింటి వేధింపులకు అల్లుళ్ళ బలి అని సాధారణంగా విని ఉండం. కానీ అలాంటిదే జరిగింది. ఇద్దరు యువకులు అత్తింటి వేధింపులు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోను తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. 
 
సిద్ధిపేట ఇందిరమ్మ కాలనీకి చెందిన కనకరాజు భార్య రాణి నెలరోజుల క్రితం అనారోగ్యంతో చనిపోయింది. కనకరాజే తన భార్యను చంపేశాడని అత్తతో పాటు బావమరుదులు సూటిపోటి మాటలన్నారు. ఎంతో ప్రేమగా చూసుకునే తన భార్య చనిపోవడం తను జీర్ణించుకులేకుపోతున్నాను. దానికి తోడు మా అత్త నన్ను సూటిపోటి మాటలనడం చాలా బాధేస్తుందంటూ సెల్ఫీ వీడియో తీసి సూసైడ్ చేసుకున్నాడు కనకరాజు.
 
అలాగే సంగారెడ్డికి చెందిన కొర్లేకల్లికి శ్రీకాంత్‌కు హైదరాబాద్‌కు చెందిన పావనికి సంవత్సరం క్రితం వివాహమైంది. కుటుంబ సభ్యులను ఎదిరించి వీరు వివాహం చేసుకున్నారు. ఇటీవలే కుటుంబ సభ్యులను కలిసేందుకు పావని వాళ్ళింటికి వెళ్ళాడు శ్రీకాంత్. అత్త ఇష్టమొచ్చినట్లు శ్రీకాంత్‌ను తిట్టింది. దీంతో మనస్తాపానికి గురైన శ్రీకాంత్ తోటలోకి వెళ్ళి పురుగుల మందు తీసుకుని కూల్ డ్రింక్‌లో కలుపుకుని తాగేశాడు. శ్రీకాంత్ కూడా సెల్ఫీ వీడియో తీసుకుని ఫ్రెండ్స్‌కు పంపాడు. ఈ రెండు సంఘటనలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments