Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లుడే కదా అని నమ్మివెళ్తే అత్తపై అత్యాచారం

అల్లుడే కదా అన్ని నమ్మి వెళ్లిన ఓ అత్త అత్యాచారానికి గురైంది. తెలంగాణా రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లాలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని దౌల్తాబాద్‌ మండలం గోవిందాపురం గ్రామానికి చెందిన ఓ మహిళక

Webdunia
శనివారం, 20 జనవరి 2018 (10:13 IST)
అల్లుడే కదా అన్ని నమ్మి వెళ్లిన ఓ అత్త అత్యాచారానికి గురైంది. తెలంగాణా రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లాలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని దౌల్తాబాద్‌ మండలం గోవిందాపురం గ్రామానికి చెందిన ఓ మహిళకు యేడాది క్రితం భర్త చనిపోయాడు. ఆ తర్వాత తన కుమారుడితో కలిసి జీవిస్తూ కూలి పనులకు వెళ్తుండేది. ఇందులోభాగంగానే గురువారం ఇదే మండలం శేర్‌బందారం కూలి పని చేసేందుకు వెళ్లింది. పని పూర్తి కాగానే.. అదే గ్రామంలో అల్లుడు (కుమార్తె భర్త)కి ఫోన్ చేసి ఇంటికి తీసుకెళ్లాలని కోరింది. 
 
నిజానికి గత కొన్ని రోజులుగా అత్తపై అల్లుడు కన్నేశాడు. ఇదే అదునుగా భావించిన అల్లుడు బైక్ వేసుకుని పొలం వద్దకు వచ్చి అత్తను ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత మార్గమధ్యంలో ఉన్న మహ్మద్‌షాపూర్‌ అటవీప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను లొంగదీసుకునేందుకు యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో చావబాది రేప్ చేశాడు. 
 
అనంతరం ఆమెను సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ఇంటికి చేర్చాడు. అయితే జరిగిన విషయాన్ని కుమారులకు చెప్పిన ఆమె అదే రోజు రాత్రి దౌల్తాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments