Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మైల్ ప్లీజ్.. పులిని ఫోటోకు ఫోజివ్వమన్న యువకుడు, ఎక్కడ?

Webdunia
బుధవారం, 2 జూన్ 2021 (11:38 IST)
సాధారణంగా పులిని చూస్తే భయంతో పారిపోతాం. ప్రాణాలను దక్కించుకునేందుకే ప్రయత్నిస్తూ ఉంటాం. అది సాధారణమే. అయితే తెలంగాణా రాష్ట్రంలో ఒక యువకుడు రెండు పులులు కనిపిస్తే ఏకంగా వాటిని ఫోటోలు తీస్తూ స్మైల్ ప్లీజ్ అంటూ పులులనే ఫోజిలివ్వమన్నాడు. 
 
నిన్న ఆదిలాబాద్ లోని రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా నుంచి రెండు పెద్దపులులు రోడ్లపైకి వచ్చేశాయి. దట్టమైన అటవీ ప్రాంతం నుంచి ఆదిలాబాద్ - ఒరిస్సా జాతీయ రహదారిపైకి వచ్చేశాయి. అయితే అటువైపుగా వెళుతున్న వాహనదారులు వాహనాలను ఎక్కడికక్కడే నిలిపివేశారు.
 
పులులు మెల్లగా రోడ్లపైనే నడుచుకుంటూ వెళుతున్నాయి. అయితే ఒక యువకుడు పులులకు దగ్గరగానే ఉంటూ వాటిని తన సెల్ ఫోన్‌లో బంధించాడు. బాగా దగ్గరికి వచ్చిన పులిని స్మైల్ ప్లీజ్ అంటూ ఫోటోలకు ఫోజులు ఇమ్మన్నాడు. యువకుడికి ఆ పులులు దగ్గరగా రావడం చూసిన అక్కడి వారంతా  భయభ్రాంతులకు గురయ్యారు.
 
సుమారు 20 నిమిషాల పాటు రోడ్డుపైనే రెండు పులులు ఉన్నాయి. అయితే ఎవరిపైనా పులులు అటాక్ చేయలేదు. ఆ తరువాత దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయాయి. ఎండాకాలం కావడంతో తాగడానికి నీరు లేకుండా సరైన ఆహారం దొరక్క పులులు రోడ్లపైకి వచ్చి ఉంటాయని అటవీశాఖాధికారులు భావిస్తున్నారు.
 
ఐతే క్రూర జంతువులు అలా రోడ్లపైకి వచ్చి తిరుగుతున్నప్పుడు వాటికి దూరంగా వుండాలనీ, వాటి ఫోటోలు, వీడియోలు తీసేందుకు సాహసం చేయరాదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు పులివాత పడి పలువురు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments