Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణా ఎన్నికలు : పోటీ నుంచి తప్పుకున్న షర్మిల.. కాంగ్రెస్‌కు మద్దతు

Webdunia
శుక్రవారం, 3 నవంబరు 2023 (14:58 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుకుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం అధికారికంగా వెల్లడించారు. అలాగే, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. తెలంగాణలోని భారాస ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆమె శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో జరగపోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. కాంగ్రెస్ నాయకులన్నా.. కార్యకర్తలన్నా తనకు అపారమైన గౌరవం ఉందన్నారు. ఇటీవల ఢిల్లీలో సోనియా, రాహుల్ గాంధీలను కలిసినపుడు తనను కుటుంబ సభ్యురాలిగా వారు చూశారని చెప్పారు. 
 
నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించామని, తమ పార్టీ తరపున కొందరు అభ్యర్థులను బరిలోకి దించాలని భావించామన్నారు. అదేసమయంలో తాను ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతాననే నమ్మకం తనకు ఉందన్నారు. ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని ఆమె జోస్యం చెప్పారు. 
 
అందుకే కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలరాదన్న నిర్ణయంతో ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని తాము నిర్ణయించినట్టు చెప్పారు. కాంగ్రెస్ గెలుపు అవకాశాలను అడ్డుకోకూడదనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తమ నిర్ణయాన్ని పార్టీ శ్రేణులు, నాయకులంతా అర్థం చేసుకోవాలని షర్మిల కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామలక్ష్మణులు కల్పిత పాత్రలు - బహిరంగ క్షమాపణలు చెప్పిన శ్రీముఖి (Video)

'గేమ్ ఛేంజర్' బెనిఫిట్ షోకు తెలంగాణ సర్కారు అనుమతి నిరాకరణ!!

రామలక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్సా? మరి నువ్వేంటి?: సారీ చెప్పిన శ్రీముఖి (Video)

ట్రోలింగ్‌కు దారితీసిన అనంత శ్రీరామ్ ప్రసంగం!!

తాతయ్య బాలయ్యకు ఇంకా ఇలాంటి సీన్లు, డ్యాన్సులు అవసరమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments