Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్... అక్రమాస్తుల కేసులో నోటీసు

Webdunia
శుక్రవారం, 3 నవంబరు 2023 (14:15 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టు శుక్రవారం తేరుకోలేని షాకిచ్చింది. వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. జగన్‌తో పాటు.. సీబీఐకు కూడా నోటీసులు జారీచేసింది. జగన్‌పై నమోదైనన 11 అక్రమాస్తుల కేసుల విచారణలో గత దశాబ్దకాలంగా తీవ్ర జాప్యం జరుగుతుందని పేర్కొన్నారు. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు జగన్‌తో పాటు సీబీఐకు కూడా నోటీసు జారీచేస్తూ, తదుపరి విచారణను జనవరి నెలకు వాయిదా వేసింది. 
 
మరోవైపు, వైసీపీ నాలుగున్నరేళ్ల పాలన అవినీతిమయం అని ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అంటున్నారు. ఇప్పటికే సీఎం జగన్‌పై ఉన్న కేసుల విషయం తేల్చాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన రఘురామ... తాజాగా, వైసీపీ పాలనలో చోటుచేసుకున్న అవినీతి నిగ్గు తేల్చాలని ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు.
 
సీఎం జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని తన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో ఆరోపించారు. ఈ మేరకు ఏ శాఖలో ఎలా అవినీతి జరిగిందన్న విషయాన్ని రఘురామ వివరంగా తన పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రజాధనానికి నష్టం కలిగించేలా ఏపీ ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని వివరించారు. సాక్షి పత్రిక, సాక్షి చానల్‌కు లబ్ధి కలిగేలా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. సీఎస్ సహా పలువురు ఐఏఎస్ అధికారుల నిర్లక్ష్య వైఖరిని కూడా రఘురామ తన పిటిషన్‌లో ప్రస్తావించినట్టు తెలుస్తోంది.
 
మొత్తం 1,311 పేజీలతో రఘురామ న్యాయవాది ఉన్నం మురళీధర్ సుదీర్ఘ పిటిషన్ దాఖలు చేశారు. మద్యం ఇసుక, అంబులెన్స్‌ల కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. పోర్టులను అనుచరులకు కట్టబెట్టే క్రమంలో భారీ అవినీతికి పాల్పడ్డారని వివరించారు. టర్న్‌కీ ఎంటర్‌ప్రైజెస్ ద్వారా ఇసుక కుంభకోణానికి పాల్పడ్డారని ఆ పిటిషన్‌లో తెలిపారు.
పేదలందరికీ ఇళ్లు అనే పథకం ద్వారా ప్రైవేటు వ్యక్తుల స్థలాలను కొనుగోలు చేసి భారీ అవినీతికి పాల్పడ్డారని వెల్లడించారు. ఎక్సైజ్ పాలసీని మార్చి భారీ ఎత్తున మద్యం అక్రమాలకు పాల్పడ్డారని రఘురామ తన పిటిషన్‌లో ఆరోపించారు. 
 
భారతీ సిమెంట్స్‌కు కూడా లబ్ది కలిగేలా వ్యవహరించారని, ప్రభుత్వానికి సరఫరా చేసే సిమెంట్ రెడ్ బ్యాగ్‌లలో ఇవ్వాలని నిబంధన విధించిన అంశాన్ని కూడా పిటిషన్‌లో ప్రస్తావించారు. అన్ని సిమెంట్ కంపెనీలు ఇక్కడే భారతీ పాలిమర్స్ నుంచి రెడ్ బ్యాగ్‌లు కొనుగోలు చేయాలని నిబంధన విధించినట్టు వివరించారు. సీఎం, మంత్రివర్గం, పలువురు సీనియర్ అధికారులతో సహా మొత్తం 41 మందిని ఈ పిటిషన్ లో ప్రతివాదులుగా పేర్కొన్నారు. పెద్దిరెడ్డి, సజ్జల, విజయసాయిరెడ్డి, వాసుదేవరెడ్డిలను కూడా ప్రతివాదులుగా పేర్కొన్నారు. రఘురామ పిల్ ను స్వీకరించిన ఏపీ హైకోర్టు... ఆ పిల్‌కు నెంబరు కేటాయించింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెన్నైలో అల్లు అర్జున్, శ్రీలీల 'పుష్ప 2 ది రూల్' మూడవ సింగిల్ 'కిస్సిక్' రిలీజ్

ఇండియా, యుకె, యుఎస్ఏ వ్యాప్తంగా తమ బ్రేక్ త్రూ 2024 కోసం ఎంపికైన వ్యక్తులను వెల్లడించిన బాఫ్టా

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments