తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని రాజకీయ పార్టీలలో విమర్శలు, ప్రతివిమర్శలతో దూసుకుపోతున్నారు. రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఎంఐఎం డబ్బులు తీసుకుని బీజేపీ కోసం పనిచేస్తున్నదని, కాంగ్రెస్‌ను ఓడించడానికి దేశవ్యాప్తంగా పోటీచేస్తున్నదని రాహుల్ ఆరోపించారు.
ఇందుకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ రాహుల్ గాంధీకి కౌంటరిచ్చారు. దానికి ప్రతిగా తాము యూపీఏకు మద్దతు ఇవ్వడానికి ఎంత డబ్బు ఇచ్చారని అసదుద్దీన్ కౌటర్ ఇచ్చారు. దమ్ముంటే రాహుల్ గాంధీ హైదరాబాద్‌లో పోటీచేయాలని సవాల్ విసిరారు. అప్పుడు ఎంఐఎం సత్తా ఏంటో చూపిస్తామని వ్యాఖ్యానించారు.