వచ్చే ఎన్నికల్లో వైఎస్. షర్మిల పోటీ చేస్తే స్థానం ఇదే...

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2022 (18:22 IST)
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల వచ్చే యేడాది తెలంగాణాలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని ఆమె బుధవారం వెల్లడించారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నట్టు తెలిపారు. ఇందులోభాగంగా, ఈ నెల 16వ తేదీన పాలేరులో పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం భూమి పూజ జరుగుతుందని తెలిపారు. ఆ రోజున పార్టీ విధానాలను వెల్లడిస్తామని తెలిపారు. 
 
ఇదిలావుంటే, తెలంగాణాలో రాజన్న రాజ్యాన్ని తెలంగాణాలో ఏర్పాటు చేయడమే లక్ష్యంగా షర్మిల పాదయాత్ర చేపట్టిన విషయం తెల్సిందే. ఈ పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చినా.. రాష్ట్ర పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. 
 
ఆమె పిటిషన్‌ను విచారించిన కోర్టు.. పాదయాత్రకు అనుమతి ఇస్తూనే కొన్ని షరతులు విధించింది. రాజకీయ విమర్శలు మాత్రమే చేయాలని వ్యక్తిగత విమర్శలు చేయకూడదన్న నిబంధన విధించింది. అలాగే, హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని షర్మిల నివాసం వద్ద ఉంచిన బారికేడ్లను తొలగించాలని ఆదేశించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments