Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైఎస్.షర్మిలకు ఇన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయా..? హెల్త్ బులిటెన్ రిలీజ్

Advertiesment
ys sharmila health
తన పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలన్న ఏకైక డిమాండ్‌తో గత రెండు రోజులుగా ఆమరణ నిరాహారదీక్షకు దిగిన వైఎస్ఆర్ టీపీ పార్టీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల దీక్షను తెలంగాణ పోలీసులు భగ్నం చేసిన ఆమెను జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఓ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. 
 
ఆదివారం తెల్లవారుజామున ఒంటి గంటకు ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారని, బీపీ, బలహీనత, మైకగా ఉండటంతో ఆస్పత్రిలో చేరినట్టు తెలిపారు. ఆమెకు డీహైడ్రేషన్, ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ ఉందని, తీవ్రమైన ఒలిగురియా, అధిక అయాన్ గ్యాప్ మెటాబాలిక్ అసిడోసిమ్, ప్రీరీనల్ అజోటెమియా కూడా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. 
 
ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఈ రోజు లేదా రేపు ఉదయం డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. షర్మిల 2 లేదా 3 వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. 
 
కాగా, తన పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చినా ప్రభుత్వం మాత్రం అందుకు నిరాకరించింది. దీంతో ఆమె లోటస్ పాండ్‌లోని వైఎస్ఆర్ టీపీ ప్రధాన కార్యాలయంలో ఆమరణ నిరాహారదీక్షకు శనివారం నుంచి చేపట్టారు. ఆదివారం అర్థరాత్రి ఆమె దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆస్పత్రికి తరలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నలుగురు భార్యలు ఉండటం ముస్లింలకు చట్టబద్ధమే : ఎంపీ అసదుద్దీన్