Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైఎస్ షర్మిల అరెస్ట్.. కేసీఆర్ పతనానికి ఇదే నాంది..

Advertiesment
YS sharmila
, శుక్రవారం, 9 డిశెంబరు 2022 (16:01 IST)
YS sharmila
టీఆర్‌ఎస్‌ పాలనకు వ్యతిరేకంగా వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. ఆమె చేపట్టిన నిరాహార దీక్షకు అనుమతి లేకపోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. 
 
దీంతో ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్‌ విగ్రహం ఎదుట నిరాహార దీక్ష చేస్తున్న షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసు వాహనంలో బలవంతంగా తరలించారు. ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పక్కకు నెట్టి అరెస్టు చేశారు. 
 
ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ మరోసారి నాశనం చేశారని మండిపడ్డారు. కేసీఆర్‌కు తప్పులు చేసిన చరిత్ర ఉందని, ఆయన పతనానికి ఇదే నాంది అని ఆమె అభిప్రాయపడ్డారు. మరోవైపు షర్మిలపై ఆమెపై కేసు పెట్టే అవకాశం ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరుడు ముక్కు చిన్నదిగా ఉందని అమ్మలక్కల గుసగుసలు.. పెళ్లి వద్దన్న వధువు