Webdunia - Bharat's app for daily news and videos

Install App

సికింద్రాబాద్‌లో ప్రారంభమైన ఉజ్జయిని మహంకాళి బోనాలు...

Webdunia
ఆదివారం, 9 జులై 2023 (11:42 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ నగరంలో ఉజ్జయిని మహంకాళి బోనాలు అట్టహాసంగా మొదలయ్యాయి. అమ్మవారికి తొలి పూజల అనంతరం ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటలకు తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. 
 
ఇదిలావుంటే, అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు ఉదయం నుంచే క్యూకట్టారు. దీంతో ఆలయం వద్ద కోలాహలం నెలకొంది. అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు సమర్పించుకుంటున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ ఉదయం 9.30 గంటలకు అమ్మవారికి బోనం సమర్పించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తుల కోసం ఆరు వరుసలను ప్రత్యేకంగా ఏర్పాటుచేసి తొక్కిసలాట లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. 
 
బోనాల నేపథ్యంలో ఆర్టీసీ బస్సు ప్రత్యేకంగా 150 సిటీ బలను నడుపుతోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు, బోనాల నేపథ్యంలో సికింద్రాబాద్ వైపు నుంచి వెళ్లే ట్రాఫిక్‌ను ఆదివారం, సోమవారాల్లో ప్రత్నామ్నాయ మార్గాల్లో మళ్లించారు. ఈ బోనాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments