Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొన్న మూత్రం పోశారు.. ఇపుడు పాదాలు నాకించారు.. ఎంపీలో అమానవీయ ఘటనలు

Webdunia
ఆదివారం, 9 జులై 2023 (11:27 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పాలనలో అమానవీయ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మొన్నటికిమొన్న ఓ గిరిజన తెగకు చెందిన వ్యక్తితో బీజేపీ ప్రతినిధి ఒకరు మూత్ర విసర్జనకు పాల్పడ్డారు. ఈ ఘటన మరువక ముందే జరిగిన మరో ఘటన ప్రభుత్వంపై విమర్శలకు కారణమవుతోంది. 
 
ఓ యువకుడిని కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లిన వ్యక్తులు అందులోనే అతడితో 17 ఏళ్ల కుర్రాడి పాదాలు నాకించి వికృత చేష్టలకు దిగారు. అంతకుముందు చెప్పులతో చితకబాదారు. కారులోనే ఉన్న మరో వ్యక్తి ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అదికాస్తా వైరల్ అయింది.
 
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. బాధితుడు, నిందితులు గ్వాలియర్ జిల్లాలోని డబరా ప్రాంతానికి చెందిన యువకుడిగా గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న మిగతా వారి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్ నారాయణమూర్తి యూనివర్సిటీ పేపర్ లీక్ నాకు బాగా నచ్చింది : త్రివిక్రమ్ శ్రీనివాస్

యువతను ఆకట్టుకునేలా మ్యానిప్యూలేటర్ టైటిల్ వుందన్న బి.గోపాల్

GMB: మహేష్ బాబు నిర్మిస్తున్న రావు బహదూర్ చిత్రం నుంచి సత్య దేవ్ ఫస్ట్ లుక్

గోవాలో తాగిపడిపోతే సుప్రీత ఆ పని చేసింది : అమర్ దీప్

వామ్మో... 'దేవా' పాత్రధారికి అంత రెమ్యునరేషనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments