గర్భిణి ప్రసవ సమయంలో శిశువు తలపై కత్తెర గాయం, మృతి

Webdunia
బుధవారం, 11 నవంబరు 2020 (17:06 IST)
ఏరియా ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ చిన్నారి బలైపోయింది. అమ్మ కడుపు నుండి ఆరాటపడుతూ బయట రాకుండానే తనువు చాలించింది. తొమ్మిది నెలలు అమ్మ కడుపులో పెరిగి బయట ప్రపంచాన్ని చూడకుండానే కన్ను మూసింది. ఈ దారుణ ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రం లోని ఏరియా ఆస్పత్రిలో జరిగింది.
 
సూర్యాపేట జిల్లా కేంద్రం లోని ఏరియా ఆస్పత్రిలో ప్రసవం కోసం వచ్చిన మహిళకు నర్సు ఆపరేషన్ చేసింది. ఆ సమయంలో వైద్యులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో నర్సు ఆపరేషన్ చేసినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సమయంలో కత్తెరతో శిశువు తలపై గాయం అయ్యింది. తీవ్రంగా బ్లీడింగ్ అయి చిన్నారి మృతి చెందింది.
 
దీంతో గర్భిణి బంధువులు సిబ్బంధి నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ హాస్పిటల్ ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Predator: Badlands: అన్ని జోన్లతో కలిపిన ప్రెడేటర్: బ్యాడ్‌లాండ్స్ సిద్ధమైంది

Raviteja: అందుకే మాస్ జాతర చిత్రీకరణ కాస్త ఆలస్యమైంది : దర్శకుడు భాను భోగవరపు

Bunny Vas: ఖమ్మం, వరంగల్ మధ్య జరిగే రియల్ కథతో రాజు వెడ్స్ రాంబాయి : వేణు ఊడుగుల

మెగాస్టార్ చిత్రంలో అవకాశం వచ్చిందా? మాళవికా మోహనన్

Janviswaroop: మహేష్ బాబు మేనకోడలు జాన్విస్వరూప్ నటిగా ఎంట్రీ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments