Webdunia - Bharat's app for daily news and videos

Install App

13 నుంచి తెలంగాణాలో పాఠశాలలు ప్రారంభం : సబితా ఇంద్రారెడ్డి

Webdunia
ఆదివారం, 12 జూన్ 2022 (16:57 IST)
తెలంగాణ రాష్ట్రంలో వేసవి సెలవుల అనంతరం సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. పాఠశాలల ప్రారంభం కోసం ఉపాధ్యాయులు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వేసవి సెలవులు పొడిగింపు లేదని మంత్రి స్పష్టం చేశారు. 
 
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 65లక్షల మంది పిల్లలకు మంత్రి స్వాగతం పలికారు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా 9వేల పాఠశాలల్లో పనులు జరుగుతున్నాయని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు జరుగుతాయని వెల్లడించారు.
 
ప్రభుత్వం ముందుగా ప్రకటించిన విధంగా ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుందని మంత్రి తెలిపారు. ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుందని వెల్లడించారు. అందుకనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments