ఒకే రోజు 879 కేసులు.. తెలంగాణలో ఆర్టీసీ సేవలు స్టాప్

Webdunia
బుధవారం, 24 జూన్ 2020 (10:08 IST)
తెలంగాణలో ఆర్టీసీ బస్సు సర్వీసులను ఆపేశారు. ఇప్పటికే అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య చర్చలు ప్రారంభం కావడంతో రెండు రాష్ట్రాల మధ్య బస్సుల రాకపోకలు పునరుద్ధరిస్తారని అందరూ భావించారు. కానీ తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీవ్ర నిరాశ ఎదురైంది. నేడు జరగాల్సిన కీలక భేటీ వాయిదా పడింది.
 
కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ భేటీని వాయిదా వేస్తున్నట్లు రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు ఇప్పట్లో తిరిగి ప్రారంభం కావడం కష్టమేనని అధికారులు భావిస్తున్నారు. 
 
మరోవైపు హైదరాబాద్‌లో కరోనా వైరస్‌ రోజురోజుకీ ఉగ్రరూపం దాలుస్తోంది. ఈ నేపథ్యంలో అంతరాష్ట్ర బస్సులను నడపడానికి సీఎం కేసీఆర్‌ అంగీకరించపోవచ్చని భావిస్తున్నారు. మొత్తానికి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు ఇప్పట్లో ప్రారంభం కావడం కష్టమని పలువురు అధికారులు పేర్కొంటున్నారు.  
 
మరోవైపు తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. రోజు రోజుకీ పాజిటివ్‌ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9వేల మార్కును దాటేసింది. మంగళవారం తాజాగా 879 పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 9553కు చేరుకుంది. 
 
వీటిలో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 652 కేసులు, మేడ్చల్‌ జిల్లాలో 112, రంగారెడ్డి జిల్లాలో 62 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన 9వేలకు పైగా కేసుల్లో 4224 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 220 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రస్తుతం 5109మంది చికిత్సపొందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏవీఎం శరవణన్ భౌతికకాయానిక నివాళులు.. సూర్య కంటతడి

నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఆశించకండి : రాజ్ నిడిమోరు మాజీ భార్య

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

Allu Arjun : కున్రిన్ పేరుతో జపనీస్ థియేటర్లలోకి అల్లు అర్జున్... పుష్ప 2

Arnold : అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీమియర్‌ చూసి అర్నాల్డ్ ష్వార్జెనెగర్ ప్రశంస

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments