Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఎఫెక్ట్.. జగన్ కీలక నిర్ణయం.. డిగ్రీ, పీజీ, బీటెక్ పరీక్షలు రద్దు

Webdunia
బుధవారం, 24 జూన్ 2020 (10:01 IST)
ఏపీలో రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో విద్యార్థుల క్షేమాన్ని ఆకాంక్షిస్తూ ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో పదవ, ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులను పాస్ చేసిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ప్రస్తుతం డిగ్రీ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు లేకుండా పాస్ చేస్తూ ప్రకటించారు. 
 
పీజీ విద్యార్థులను కూడా కరోనా కారణంగా పరీక్షలు లేకుండానే పాస్ చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. ఫలితంగా డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కోర్సుల ఫైనల్ సెమిస్టర్‌ పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అన్ని విశ్వవిద్యాలయాల వీసీలు, రిజిస్ట్రార్లు, ఇతర ఉన్నతాధికారులతో విద్యాశాఖ మంత్రి సురేష్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన అనంతరం ఈ నిర్ణయం వెల్లడించారు. అలాగే, డిగ్రీ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులను ప్రమోట్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
 
డిగ్రీ, పీజీ ఫైనల్‌ సెమిస్టర్‌ రద్దు నేపథ్యంలో గ్రేడింగ్‌ లేదా మార్కులపై నిర్ణయం నిర్ణయం తీసుకోవాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. స్థానిక విశ్వవిద్యాయాల ఎగ్జిక్యూటివ్‌ కమిటీలు వీటిపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు  నిర్వహించే పరిస్థితి లేదు. 
 
పరీక్షల నిర్వహణ అంటే విద్యార్థుల జీవితాలను రిస్క్‌లో వేయడమే అని అంతా అభిప్రాయపడుతున్నారు. పరీక్షలు రద్దు చేయాలని తల్లిదండ్రుల నుంచి డిమాండ్లు వచ్చాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. ఏకంగా పరీక్షలే రద్దు చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments