ఐటీ ఉద్యోగులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. వజ్ర మినీ బస్సులు వచ్చేశాయిగా!

Webdunia
శుక్రవారం, 25 మార్చి 2022 (22:32 IST)
mini bus
టీఎస్‌ఆర్టీసీ ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్‌లోని ఐ‌టి కంపెనీలు ఎక్కువగా ఉండే హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, మాధాపూర్ తదితర ప్రాంతాలలో వజ్ర బస్ సర్వీసులను ప్రవేశపెట్టింది. అక్కడ ఐ‌టి కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగులు మెట్రో స్టేషన్ల నుంచి తమ కార్యాలయాలకు మళ్ళీ సాయంత్రం మెట్రో స్టేషన్లు చేరుకొనేందుకు ఆటోలు, బస్సులు, క్యాబ్‌లలో ప్రయాణిస్తూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. 
 
దీనిని ఓ మంచి వ్యాపారవాకాశంగా గుర్తించిన టీఎస్‌ఆర్టీసీ ఈ ప్రాంతాలలో మెట్రో స్టేషన్లు, ఐ‌టి కంపెనీలను కలుపుతూ వజ్ర మినీ బస్ సర్వీసులను ప్రారంభించింది. ఐ‌టి కంపెనీలున్న ఐ‌టి కారిడార్‌లోనే రోజుకి సుమారు 5 లక్షల మంది ప్రయాణిస్తుంటారు.
 
కనుక నగరంలోని జేఎన్‌టీయూ- వేవ్‌రాక్ మధ్య ఈ వజ్ర మినీ ఏసీ బస్సులను అందుబాటులోకి తెచ్చింది. ఈ మినీ బస్సులలో సైబర్‌టవర్స్, మైండ్‌స్పేస్, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి, డీఎల్‌ఎఫ్, ఇన్ఫోసిస్, విప్రో, ఐసీఐసీఐ, అమెజాన్, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని పలు ప్రాంతాలకు మళ్ళీ మెట్రో స్టేషన్లకు అతి తక్కువ చార్జీలతో చేరుకోవచ్చు. 
 
జేఎన్‌టీయూ నుంచి వేవ్‌ రాక్‌ వరకు ఉదయం 8గంటల నుంచి 8.30, 9.50, 10.20 గంటలకు మళ్ళీ సాయంత్రం 4.25, 4.55, 6.15, 6.45 గంటలకు బస్సులు బయలుదేరుతాయి.  
 
అదేవిదంగా వేవ్‌రాక్‌ నుంచి జేఎన్‌టీయూకి ప్రతీరోజు ఉదయం 8.50, 9.20 గంటలకు బయలుదేరుతాయి. మళ్ళీ సాయంత్రం 3.35, 4.05, 5.25, 5.55 గంటలకు వరుసగా బస్సులు బయలుదేరుతాయి.  
 
ఛార్జీలు: జేఎన్‌టీయూ నుంచి మైండ్‌స్పేస్‌కు రూ.20, వేవ్‌రాక్‌కు రూ.40, మైండ్‌స్పేస్‌ నుంచి వేవ్‌రాక్‌కు రూ.20 టికెట్ ధర నిర్ణయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments