యువతి ప్రాణాలు కాపాడిన చేతి పర్సు ... ఎలా?

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2022 (11:11 IST)
చేతి పర్సు ఓ యువతి ప్రాణాలు కాపాడింది. ఆత్మహత్య చేసుకోవాలని భావించిన ఓ యువతి.. తన పర్సులో ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు సూసైడ్ లెటర్ రాసిపెట్టింది. ఆ తర్వాత ఆమె పర్సును మరిచిపోయి బస్సు దిగేసింది. దీన్ని గమనించిన బస్సు కండక్టర్.. దాన్ని తెరిచి చూడగా అందులో ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు లేఖ ఉంది. ఆ వెంటనే వారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు సమాచారం చేరవేశారు. ఆయన వెంటనే పోలీసులను అప్రమత్తం చేయడంతో ఆ యువతి ప్రాణాలు రక్షించారు. 
 
హైదరాబాద్ పఠాన్ చెరువులో బస్సెక్కిన ఓ యువతి సికింద్రాబాద్‌లోని జేబీఎస్‌లో దిగింది. ప్రయాణికులందరూ దిగిపోగా కండక్టరుకు బస్సులో ఓ హ్యాండ్ పర్సు కనిపించింది. అదెవరిదో తెలుసుకునేందుకు తెరిచి చూశాడు. అందులో కొంత డబ్బుతో పాటు ఓ లేఖ కూడా కనిపించింది. దాన్ని చూసి చదివి షాక్‌కు గురయ్యాడు. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు అందులో రాసి ఉండటంతో వెంటనే అప్రమత్తమయ్యాడు.
 
ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌‍కు సమాచారం చేరవేశాడు. పర్సులోని ఆధార్ కార్డు, సూసైడ్ లేఖ ఎండీకి ట్విట్టర్‌లో షేర్ చేయగా, అప్రమత్తమైన ఆయన యువతిని గుర్తించి కుటుం సభ్యులకు అప్పగించాలంటూ పోలీసులను కోరారు. దీంతో ఆర్టీసీ ఎస్ఐ దయానంద్, మారేడుపల్లి పోలీసుల సాయంతో ఆ యువతి గోసం గాలించగా, ఎట్టకేలకు వారి ప్రయత్నాలు ఫలించాయి. యువతిని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments