Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రైలు పట్టాలు దాటిన ఇద్దరు వృద్ధ మహిళలు.. భలే కాపాడారు.. (వీడియో)

Advertiesment
train
, గురువారం, 22 డిశెంబరు 2022 (12:09 IST)
మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ రైల్వే స్టేషన్‌లో రైలు పట్టాలు దాటుతున్న ఇద్దరు వృద్ధ మహిళల ప్రాణాలను కాపాడారు రైల్వే పోలీసులు. ఈ ఘటన ప్లాట్‌ఫారమ్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఇంకా ఈ వీడియోను రైల్వే మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌లో షేర్ చేసింది. వృద్ధ మహిళలు పట్టాలు దాటుతున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. 
 
ఇద్దరు మహిళలు బ్యాగులతో ఫ్లాట్‌ఫారమ్ వైపు పరుగులు పెట్టడం కనిపించింది. కొన్ని సెకన్ల తర్వాత, ఒక రైలు స్టేషన్‌కు చేరుకోవడం కనిపించింది. దీంతో రైల్వే పోలీసులు రంగంలోకి దిగి వారిని ప్లాట్‌ఫారమ్‌పైకి లాగారు.  
 
వీడియోతో పాటు, ఆంగ్లంలోకి అనువదించబడిన క్యాప్షన్ ఇలా ఉంది. "భద్రత ప్రధానం! అప్రమత్తమైన RPF మరియు GRP సిబ్బంది మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ రైల్వే స్టేషన్‌లో పట్టాలు దాటుతున్న ఇద్దరు వృద్ధ మహిళల ప్రాణాలను కాపాడారు. దయచేసి అందరూ ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఉపయోగించండి" అంటూ పోస్టు చేశారు. ఈ వీడియో డిసెంబర్ 20న పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఇది ట్విట్టర్‌లో 52,000 వ్యూస్ వచ్చాయి.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లికి అమ్మాయిలు దొరకడం లేదని.. కలెక్టరేట్ ఎదుట పెళ్లికాని ప్రసాదుల నిరసన