పబ్ జీ గేమ్ ఆడుతూ... నరాలు పట్టేశాయి.. అంతే చనిపోయాడు..

Webdunia
శుక్రవారం, 22 మార్చి 2019 (11:45 IST)
ఆన్‌లైన్ గేమ్ పబ్ జీకి బానిసలవుతూ... దానికి బలయిపోతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూ పోతోంది. నిన్నటివరకు బ్లూ వేల్ మనుషుల్ని మింగితే.. ఇప్పుడు ఆన్‌లైన్ పబ్ జీ గేమ్‌ వచ్చి పిల్లల ప్రాణాలు బలి కోరుతోంది. తాజాగా... తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా రాజారాంపల్లికి చెందిన సాగర్ అనే యువకుడు పబ్ జీకు అడిక్ట్ అయిపోయి... ఎప్పుడూ గేమ్ ఆడుతూండటంతో ఒక్కసారిగా అతడి నరాలు పట్టేసాయి. 
 
దీనితో అతని తల్లిదండ్రులు అతడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. 46 రోజుల పాటు చికిత్స పొందిన సాగర్ ఇవాళ మృతి చెందాడు.  పబ్ జీ గేమ్‌ ఆడుతూండడం వల్ల మెదడుపై ఒత్తిడి పెరిగి... పిల్లలు చనిపోతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. ఈ గేమ్ వల్ల నరాలకు సంబంధించిన వ్యాధులు కూడా ఎక్కువగా వస్తున్నాయని హెచ్చరిస్తున్నారు.
 
ఈ పబ్ జీ ఆడుతూ... ఇప్పటికే చాలా మంది మెంటల్ బాలెన్స్ కోల్పోయి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ గేమ్ ఆడి పలువురు ప్రాణాలు కొల్పోయారు. గేమ్‌లో లాగానే బయట ప్రపంచంలో కూడా ప్రవర్తిస్తున్న నేపథ్యంలో... పబ్ జీ గేమ్ ని భారత్‌లో నిషేధించాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
 
జబ్బుల బారిన పడకుండా అయితే.. వ్యాక్సిన్లు వేయించగలం కానీ... ఈ బ్లూవేల్‌, పబ్‌జీల వంటి గేమ్‌ల బారి నుండి పిల్లలని రక్షించుకోవడం ఎలాగో తెలియక తల్లిదండ్రులు ఆవేదనతో కుమిలిపోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prasanth Varma: తేజ సజ్జ హనుమాన్ చిత్రం 3డిలో రీరిలీజ్ కాబోతోంది

'జయం' రవితో కెనీషా ఫ్రాన్సిస్ బ్రేకప్ - ఫెమినిజం గెలిచింది.. ఆనందం ఓడిపోయింది..

Ramcharan: పెద్ది ప్రమోషన్ కు ముందు రామ్ చారణ్ కుడిచేతి బ్యాండేజ్ పై అభిమానులు ఆసక్తి

Naga Chaitanya: రాజస్థాన్‌లో కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న వృషకర్మ

Pavala Shyamala: ఫుట్‌పాత్‌పై దీనస్థితిలో పావలా శ్యామల..

తర్వాతి కథనం
Show comments