Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈజీ మనీ కోసం జూనియర్ ఆర్టిస్టులతో వ్యభిచారం... ఎక్కడ?

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (08:34 IST)
కరోనా లాక్డౌన్‌తో ఎక్కడి షూటింగులు అక్కడే బంద్ అయిపోయాయి. దీంతో చాలా మంది జూనియర్ ఆర్టిస్టులు పూటగడవడం కోసం ఇతర ఆదాయా మార్గాలను వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలో కొందరు అమ్మాయిలు వ్యభిచారంలోకి దిగుతున్నారు. తాజాగా కొందరు జూనియర్ ఆర్టిస్టులతో వ్యభిచారం చేయిస్తున్న ముఠాను పోలీసులు గుర్తించారు. ఈజీ మనీ సంపాదనలో భాగంగా, వీరంతా ఈ పాడుపనికి పాల్పడ్డారు. దీంతో లాడ్జీ నిర్వాహకుడితో పాటు మరో 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
హైదరాబాద్ నగరంలోని జీడిమెట్లలో వెలుగుచూసిన ఈ ఘటనను పరిశీలిస్తే, జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధి, శాపూర్ నగర్‌లోని రాఘవేంద్ర లాడ్జి‌లో కొంతకాలంగా గుట్టుచప్పుడుకాకుండా వ్యభిచారం జరుగుతోందనే సమాచారం పోలీసులకు వచ్చింది. దీంతో నిఘా వేసిన జీడిమెట్ల పోలీసులు మంగళవారం రాత్రి లాడ్జి‌పై దాడులు నిర్వహించారు. 
 
నాలుగు గదులలోని నలుగురు విటులు దనం సంపత్, ఒగ్గు ఓబిలాష్, మేరుగు సురేష్, నర్రా రాజ్ కుమార్‌లతో పాటు నిర్వాహకుడు సత్యనారాయణ ఎలియాస్ రాజేష్‌ను.. మరో నలుగురు మహిళలైన యెడిగంటి అమన్, మహాతో రాధా, షేక్ సానియా, షేక్ షభానాలను అదుపులోకి తీసుకున్నారు. 
 
పోలీసులు అదుపులోకి తీసుకున్న మహిళల్లో షేక్ హసీనా, షేక్ షభానాలు సినీ జూనియర్ ఆర్టిస్టులు కాగా, కస్టమర్ నర్రా రాజ్ కుమార్‌ వీఆర్‌ఓగా పని చేస్తున్నాడు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కరోనా ఉన్నందున లాడ్జి నడవక పోవడంతో డబ్బుల కోసం లాడ్జిలో వ్యభిచారం చేయిస్తున్నానని నిర్వాహకుడు సత్యనారాయణ ఎలియాస్ రాజేష్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. 

సంబంధిత వార్తలు

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments