ప్రముఖ పర్యాటక ప్రాంతంగా ఉన్న గోవాలోని సముద్రతీరంలో విచ్చలవిడిగా వ్యభిచారం సాగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకెళ్లి వ్యభిచారం చేయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
పనాజీ నగరంలోని కలాన్‌గుటీ బీచ్ కేంద్రంగా గుట్టుచప్పుడుకాకుండా వ్యభిచారం సాగుతోంది. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు అమ్మాయిలను సరఫరా చేస్తున్నారని క్రైంబ్రాంచ్ పోలీసులకు రహస్య సమచారం వచ్చింది. దీంతో పోలీసులు మారువేషంలో విటుడిలా ఓ పోలీసును పంపించగా వ్యభిచారం రాకెట్ బాగోతం వెలుగుచూసింది.
ఆండ్రియా పెరీరా అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి క్రైంబ్రాంచ్ పోలీసులు వ్యభిచార రాకెట్ బాగోతాన్ని బయటపెట్టారు. మహారాష్ట్ర, ఆంధ్రాల నుంచి అమ్మాయిలను గోవాకు తీసుకువచ్చి వారితో వ్యభిచారం సాగించారని పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఈ వ్యభిచార రాకెట్ కీలక సూత్రధారులైన అక్షయ్(27), థోఫిక్ (27) లను క్రైంబ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. వ్యభిచారిణులను గోవాలోని రాష్ట్ర మహిళల సదనానికి తరలించారు. ఈ వ్యభిచార రాకెట్‌పై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు.