Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబాయితో రాసలీలలు.. తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (08:29 IST)
తన కూతురు వావి వరసలు మరిచి బాబాయి వరసయ్యే వ్యక్తితో అక్రమ సంబంధం నెరపడమే కాకుండా కూతురి బెడ్‌రూమ్‌ రాసలీలల వీడియోల బయటకు రావడంతో మనస్తాపానికి గురైన ఆమె తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ ఘటన తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా నారియప్పనూర్‌ గ్రామానికి చెందిన మురుగేశన్‌ కుమార్తె శరణ్య (22) కల్లకూరిచిలోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. అదే పట్టణంలో మురుగేశన్‌కు తమ్ముడు, శరణ్యకు బాబాయి వరసయ్యే మణికందన్‌ ఇంట్లోనే ఉంటూ ఉద్యోగానికి వెళ్తుంది.

ఈ క్రమంలోనే మణికందన్‌ వలలో శరణ్య పడింది. చిన్నాన్న వరసయ్యే వ్యక్తి అని తెలిసి కూడా అతడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఒకే ఇంట్లో ఉండటంతో కుదిరినప్పుడల్లా రాసలీలల్లో మునిగితేలేవారు. ఓ రోజు ఇద్దరూ ఏకాంతంగా గడుపుతున్న సమయంలో మణికందన్‌ భార్య వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది.

దీంతో ఆమె బంధువుల మధ్య పంచాయతీ పెట్టగా ఇద్దరినీ మందలించారు. అయినప్పటికీ వారిలో ఎలాంటి మార్పూ రాకపోగా ఎలాగూ అందరికీ తెలిసిపోయిందని బరితెగించి ఇంటి నుంచి పారిపోయి చెన్నైలో కాపురం పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న శరణ్య తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిని పట్టుకొచ్చి మణికందన్‌పై కేసు పెట్టి జైలుకు పంపించారు.

వారం రోజుల తరువాత ప్రియుడు జైలు నుంచి తిరిగి వచ్చాడని తెలుసుకున్న శరణ్య అతడి వద్దకే వెళ్లిపోయింది. అదే సమయంలో శరణ్యతో బెడ్‌రూమ్‌లో ఏకాంతంగా గడిపిన వీడియోల మణికందన్‌ ఆమె తండ్రికి వాట్సాప్‌లో పంపించాడు. కూతురు చేస్తున్న నీచపు పనికి కుమిలిపోయిన తండ్రి ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం