Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాగ్యనగరికి రాష్ట్రపతి... నేడు - రేపు ట్రాఫిక్ ఆంక్షలు

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2023 (13:51 IST)
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భాగ్యనగరికి మరోమారు విచ్చేశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆమె హైదరాబాద్ నగరానికి శుక్రవారం రాత్రికి చేరుకుంటారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ద్వారా బేగంపేట్ విమానాశ్రయంలో దిగనున్న ఆమె అక్కడ నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. శుక్రవారం రాత్రి రాజ్‌భవన్‌లో బస చేసే రాష్ట్రపతి శనివారం ఉదంయ దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడెమీలో జరిగే కంబైన్డ్ గ్యాడ్యుయేషన్ పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరవుతారు. 
 
పరేడ్ శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ చూసిన క్యాడెట్లకు ఆమె తన చేతుల మీదుగా అవార్డులు అందజేస్తారు. స్నేహపూర్వక విదేశీ దేశాల నుంచి వచ్చి వైమానిక దళ అకాడమీలో శిక్షణ పొందిన క్యాడెట్‌లకు ఆమె 'వింగ్స్', 'బ్రెవెట్‌'ను అందజేస్తారు. ఈ వేడుకలో అనేక విమానాల విన్యాసాలు కూడా జరగనున్నాయి. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే ముర్ము ఢిల్లీ బయల్దేరి వెళ్తారు.
 
మరోవైపు, రాష్ట్రపతి పర్యటన సందర్భంగా శుక్ర, శనివారాల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శుక్రవారం సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు సీటీవో జంక్షన్, బేగంపేట్, బేగంపేట్ ఫ్లైఓవర్, గ్రీన్ ల్యాండ్స్ జంక్షన్, పంజగుట్ట జంక్షన్, ఎన్.ఎఫ్.సి.ఎల్ జంక్షన్లలో ట్రాఫిక్ రూల్స్ అమలు జరుగనున్నాయి. అలాగే శనివారం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల మధ్య ట్రాఫిక్ ఆంక్షలుంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments