Webdunia - Bharat's app for daily news and videos

Install App

మునుగోడు నన్ను క్షమించు... రూ.22 వేల కోట్ల కాంట్రాక్టుల కోసం...

Webdunia
శనివారం, 13 ఆగస్టు 2022 (10:35 IST)
నిన్నామొన్నటివరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ ఇపుడు ఆ పార్టీని ఒక్కొక్కరుగా వీడుతున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు బావుటా ఎగుర వేసి విమర్శల దాడి చేస్తున్నారు. ఇందులోభాగంగా, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పనిలోపనిగా కాంగ్రెస్ పార్టీకి, తన ఎమ్మెల్యే స్యభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా మునుగోడు వ్యాప్తంగా వాల్‌‍పోస్టర్లు వెలిశాయి.
 
‘మునుగోడు నిన్ను క్ష‌మించ‌దు.. రూ.22 వేల కోట్ల కాంట్రాక్ట్ కోసం.. 13 ఏండ్ల న‌మ్మ‌కాన్ని అమ్ముకున్న ద్రోహివి. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ‌ను ఈడీ వేధిస్తున్న రోజే అమిత్ షాతో బేర‌మాడిన నీచుడివి’ అని పోస్ట‌ర్ల‌లో పేర్కొన్నారు. ఈ పోస్ట‌ర్లు న‌ల్ల‌గొండ జిల్లా వ్యాప్తంగా వెలిశాయి.
 
మునుగోడు నియోజ‌క‌వ‌ర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి త‌న ఎమ్మెల్యే ప‌ద‌వి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామాను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారు. ఇక మిగిలింది ఉప ఎన్నికే. ఈ నేప‌థ్యంలో ఆయా పార్టీలు మునుగోడుపై దృష్టి కేంద్రీక‌రించాయి. కోమ‌టిరెడ్డి ఈ నెల 21న బీజేపీలో చేర‌నున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments