Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమ వరంగల్ అవుట్‌లెట్‌ తొలి వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న ప్లాట్‌ఫారమ్ 65

Webdunia
శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (18:20 IST)
భారతదేశంలోనే అతిపెద్ద టాయ్-ట్రైన్-నేపథ్య రెస్టారెంట్ ప్లాట్‌ఫారమ్ 65, తమ వరంగల్ అవుట్‌లెట్‌ మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ తొలి సంవత్సర ప్రయాణానికి అచంచలమైన మద్దతు అందించిన అభిమానులు, అంకితభావంతో పనిచేసే సిబ్బంది, చురుకైన వరంగల్ కమ్యూనిటీ ఈ వేడుకలలో పాల్గొనటం ద్వారా ఈ సందర్భాన్ని మరింత ప్రత్యేకంగా మలిచారు. 
 
కేవలం ఒక్క సంవత్సరంలోనే, ప్లాట్‌ఫారమ్ 65, ఒక వైవిధ్యమైన కలినరీ గమ్య స్థానంగా నిలిచింది. ఇక్కడ స్నేహితులు మరియు కుటుంబాలు కలిసి రావటంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విభిన్న రకాల రుచులను ఆస్వాదిస్తున్నారు. చెఫ్ వీహెచ్ సురేష్ నేతృత్వంలోని ప్రతిభావంతులైన కలినరీ  బృందం ఖచ్చితమైన రుచులను అందించటానికి అవిశ్రాంతంగా శ్రమిస్తోంది. కలిసికట్టుగా వారు భారతీయ, అంతర్జాతీయ పాక సంప్రదాయాల యొక్క ఆహ్లాదకరమైన సమ్మేళనం ప్రదర్శిస్తూ మెనూని రూపొందించారు. భారతదేశంలోని సుగంధ ద్రవ్యాల నుండి ఇటలీలోని ఆహ్లాదకరమైన రుచుల వరకు,  ప్రపంచ గ్యాస్ట్రోనమిక్ అడ్వెంచర్‌లోకి భోజన ప్రియులను తీసుకు పోవాలని ప్లాట్‌ఫారమ్ 65 లక్ష్యంగా పెట్టుకుంది. తొలి వార్షికోత్సవం పురస్కరించుకుని ప్లాట్‌ఫారమ్ 65 ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. వారు తమ ఉద్యోగులను మరియు లాయల్ కస్టమర్లను కార్పొరేట్ జనరల్ మేనేజర్ శ్రీకాంత్ బండారు & ప్లాట్‌ఫారమ్ 65 వరంగల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం. బాలసుబ్రహ్మణ్యం సమక్షంలో సత్కరించారు. వారికి ప్రత్యేక అవార్డులు మరియు ఆఫర్‌లను అందజేశారు.
 
ఈ వేడుకల పట్ల ప్లాట్‌ఫారమ్ 65 యొక్క మేనేజింగ్ డైరెక్టర్ మరియు వ్యవస్థాపకుడు శ్రీ సద్గుణ్ పాఠా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ "వరంగల్ అవుట్‌లెట్‌లో మా మొదటి సంవత్సర విజయాన్ని జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ప్లాట్‌ఫారమ్ 65 ఎల్లప్పుడూ కూడా ప్రత్యేకమైన మరియు రుచికరమైన వంటకాలైన నల్లి  ఘోష్ బిర్యానీ, క్లాసిక్ మష్రూమ్, పల్లె పట్నం పులావ్ మరియు మరెన్నో వాటితో తమ అభిమానులను ఆనందపరుస్తుంది. రాబోయే సంవత్సరాల్లో, మా కస్టమర్‌లకు తాజా మరియు ఉత్తేజకరమైన గ్యాస్ట్రోనమిక్ అనుభవాలను అందిస్తూ, కలినరీ ఆవిష్కరణల పరంగా హద్దులను మరింతగా విస్తరిస్తామని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము. వీటన్నిటినీ మించి, ఆహారం అనేది ప్రజలను ఒకచోట చేర్చి, శాశ్వతమైన జ్ఞాపకాలను సృష్టించే సార్వత్రిక భాష అనే నమ్మకానికి అంకితమై వున్నాము" అని అన్నారు. 
 
ప్లాట్‌ఫాం 65 వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ గోపిశెట్టి మాట్లాడుతూ, "వరంగల్‌లో ఒక సంవత్సరం పాటు అందించిన రుచులు, విచ్చేసిన అతిథులు మరియు మరపురాని క్షణాలను స్మరించుకోవడం పట్ల ఆనందంగా ఉన్నాము. మా వంటగది అద్భుతాల నుండి మా అతిథుల నవ్వుల వరకు, ఈ ప్రయాణం మరపురాని సాహసంగా నిలిచి పోతుంది. ఇక్కడ మాకు లభించిన ప్రేమ మరియు మద్దతు పట్ల కృతజ్ఞతలు తెలుపుతున్నాము మరియు రాబోయే సంవత్సరాలలో మరింత సంతోషకరమైన రుచుల అనుభవాల కోసం ఎదురు చూస్తున్నాము" అని అన్నారు. 
 
ప్లాట్‌ఫారమ్ 65 దాని ఆకర్షణీయమైన రైలు నేపథ్య రెస్టారెంట్‌గా స్థానికులు మరియు పర్యాటకులలో బాగా ప్రసిద్ధి చెందింది. రెస్టారెంట్ దాని ప్రత్యేకమైన అనుభవ-ఆధారిత భోజనానికి ప్రసిద్ధి చెందింది, ఇక్కడ మినీ టాయ్ రైళ్లలో ఆహారాన్ని సృజనాత్మకంగా అందిస్తారు, భోజన ప్రియులను ఆకట్టుకుంటూ ఇది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments