Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నైరుతి రుతుపవనాలు ఆశాజనకం.. మరో నాలుగు రోజులు వర్షాలే

weather report
, శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (16:09 IST)
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో వర్షపాతం ఆశాజనకంగానే ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణలో మరో నాలుగు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 
 
శుక్ర, శనివారాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. 
 
వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందని, దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. 
 
హైదరాబాద్ సహా మరికొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. నిజామాబాద్ జిల్లాలో గురువారం అత్యధికంగా 42.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉప ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల హహా.. 3 సీట్లకే బీజేపీ పరిమితం