టీఆరెస్ వ్యూహకర్తగా పీకే ?

Webdunia
గురువారం, 21 జనవరి 2021 (09:38 IST)
2023 ఎన్నికల్లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సేవలను ఉపయోగించుకునే అంశంపై టీఆరెస్ లో చర్చ జరుగుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. పీకే గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ విజయానికి తోడ్పడిన సంగతి జగద్వితం.

త్వరలో పశ్చిమ బెంగాల్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీకి వ్యూహకర్తగా ఒప్పందం కుదిరింది.ఈ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ ని ఎదుర్కోవడానికి తగిన వ్యూహం అవసరమన్నది టీఆరెస్ నాయకుల ఆలోచన.

అయితే బెంగాల్ లో మమత విజయాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలా?లేక ముందే పీకే తో మాట్లాడాలా ? అనే విషయమై ఇంకా స్పష్టత లేదు. అసెంబ్లీ ఎన్నికలకు మూడేళ్ళ సమయం ఉన్నందున ప్రశాంత్ కిశోర్ తో సంప్రదింపులకు ఇది తగిన సమయం కాదని కొందరు టీఆరెస్ నాయకులు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తున్నది.

మూడేళ్ళ కాలంలో తెలంగాణ రాజకీయ చిత్రపటంలో పలు కీలక మార్పులు జరగనున్నవి. కేసీఆర్ స్థానంలో కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని టీఆరెస్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కోడై కూస్తున్నారు.కాగా వ్యూహకర్త పీకే. సేవల
వ్యవహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోవలసి ఉన్నది. కేసీఆరే గొప్ప వ్యూహ రచనా 
దురంధరుడు కాగా వేరే బయటి వ్యక్తుల అవసరం ఏమిటి అన్న ప్రశ్న కూడా తలెత్తుతున్నది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dharma Mahesh: హీరో ధర్మ మహేష్ ప్రారంభించిన జిస్మత్ జైల్ మందీ

బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర డియోల్ ఇకలేరు

వంద కోట్ల మార్కులో వరుసగా మూడు చిత్రాలు.. హీరో ప్రదీప్ రంగనాథన్ అదుర్స్

ధనుష్, మృణాల్ ఠాకూర్ డేటింగ్ పుకార్లు.. కారణం ఏంటంటే?

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments