Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీఆర్ఎస్‌కు ప్రజా మద్దతు లేదు: స్మృతి ఇరానీ

టీఆర్ఎస్‌కు ప్రజా మద్దతు లేదు: స్మృతి ఇరానీ
, గురువారం, 26 నవంబరు 2020 (08:00 IST)
'సబ్‌కా సాథ్‌.. సబ్‌ కా వికాస్'‌ భారతీయ జనతా పార్టీ విధానమని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె హైదరాబాద్‌ వచ్చారు. ఈ సందర్భంగా స్మృతి ఇరానీ  బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో టీఆర్‌ఎస్‌, ఎంఐఎంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

'తెలంగాణ కోసం చాలా మంది ప్రాణాలర్పించారు. వాళ్ల కుటుంబాల గుండెలు పగిలాయి. అవినీతి, అవకాశవాద పొత్తు వల్ల హైదరాబాద్ వరదలతో మునిగింది. వరదల్లో 80 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు ఫైనల్ మెమోరాండం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇవ్వలేదు. దుబ్బాక ఉపఎన్నికతో తెలంగాణ ప్రజల సపోర్ట్‌ అధికార పార్టీకి లేదని తెలిసిపోయింది.  

రాజకీయ లబ్ధికోసమే వారికి ఓటు : అక్రమ చొరబాటుదారలుకు, రోహింగ్యాలకు హైదరాబాద్‌లో ఓటు హక్కు ఎలా కల్పించారు. రాజకీయ లబ్ధికోసమే రోహింగ్యాలకు ఓటు హక్కు కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విచారణ చేపట్టాలి. అక్రమ చొరబాటు దారుల విషయంలో పార్టీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దేశ సంపద దేశ ప్రజలే అనుభవించాలి.

ఎంఐఎం-టీఆర్‌ఎస్‌ కలిసి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయి. పారదర్శక పాలన కోసం బీజేపీకి పట్టాం కట్టాలని కోరుతున్నాం. 920 కోట్ల రూపాయలు ప్రాజెక్టును తెలంగాణకు కేటాయించాం. టెక్నికల్ టెక్స్‌ టైల్స్ కోసం కేంద్రం 1,000 కోట్లు కేటాయించింది. చిల్డ్రన్ వాక్సినేషన్, ఉపాధి ఆవకాశాలు అందకుండా చేస్తోంది. హైదరాబాద్

మహానగరంలో 75 వేల అక్రమ నిర్మాణాలు ఎలా జరిగాయి..?.  
టీఆర్‌ఎస్‌- ఎంఐఎం డ్రామాలాడుతున్నాయి : తెలంగాణలో టీఆర్‌ఎస్‌, ఎంఐఎంలు కలిసి సాగుతున్నాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ప్రజల మద్దతు లేదు. తెలంగాణలో కుటుంబ పాలనపై బీజేపీ చార్జిషీట్ విడుదల చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించలేదు. ఎంఐఎం నేతలపై ఆరోపణలు వచ్చినప్పుడు టీఆర్‌ఎస్‌ ఎందుకు విచారణకు అదేశించదు.

పాతబస్తీ ఎందుకు అభివృద్ధి కావడం లేదు.. ప్రభుత్వ పథకాలు అన్ని ఎందుకు పాతబస్తీకి చేరడం లేదు. లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్ర పరిధిలో ఉంటది. ఎంఐఎం ఎమ్మెల్యే లేఖలు ఉన్నా ప్రభుత్వం విచారణ చేయడం లేదు. టీఆర్‌ఎస్‌- ఎంఐఎం తెలంగాణ రాష్ట్రంలో మిత్ర పార్టీలు. రెండు పార్టీలు కలిసి రాజకీయ డ్రామా అడుతున్నాయి' అంటూ స్మతి ఇరానీ వ్యాఖ్యానించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరువ్యాపారులకు స్మార్ట్ కార్డులు జారీ చేస్తాం: జగన్