తెలంగాణాలో నేటి నుంచి ఆన్‌లైన్ బడులు

Webdunia
గురువారం, 1 జులై 2021 (09:30 IST)
తెలంగాణా రాష్ట్రంలో గురువారం నుంచి ఆన్‌లైన్ బడులు ప్రారంభంకానున్నాయి. ఆన్‌లైన్‌ ద్వారా 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు పాఠాలు చెబుతారు. రాష్ట్రంలో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సుమారు 50 లక్షల మంది విద్యార్థులు ఉంటారని అంచనా. 
 
ఈ ఆన్‌లైన్‌ తరగతులను టీ-శాట్‌, దూరదర్శన్‌ల ద్వారా నిర్వహిస్తారు. అలాగే ఇంటర్‌ ద్వితీయ ఏడాదితో పాటు, ఇంజనీరింగ్‌ వంటి వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన తరగతులనూ గురువారం నుంచే ప్రారంభిస్తున్నారు.
 
మరోవైపు, ఆయా తరగతులకు చెందిన విద్యార్థులకూ ఆన్‌లైన్‌ ద్వారానే బోధన జరుగుతుంది. ఇంటర్‌ ద్వితీయ ఏడాది చదువుతోన్న విద్యార్థులు సుమారు 4.5 లక్షల మంది ఉన్నారు. కరోనా వైర్‌సను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆన్‌లైన్‌ ద్వారానే పాఠాలు చెప్పాల్సి ఉంటుంది. 
 
ఆన్‌లైన్‌ తరగతుల నేపథ్యంలో రాష్ట్రంలో ఉపాధ్యాయులు రోజు విడిచి రోజు విధులకు హజరయ్యేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రతి రోజు 50 శాతం మంది ఉపాధ్యాయులు బడులకు వెళ్లాల్సి ఉంటుంది. 
 
ఈ 50 శాతం ఉపాధ్యాయులు వారి బడి పరిధిలోని విద్యార్థులు ఆన్‌లైన్‌ క్లాసులను వింటున్నారా? లేదా? అనే విషయాన్ని పరిశీలిస్తారు. ఈ ఆన్‌లైన్‌ క్లాసుల్లో విద్యార్థులకు ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించడానికి వీలుగా ఉపాధ్యాయులు కృషి చేయాల్సి ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోని వంద దేవుళ్లు చిత్రం నుంచి మెలోడీ గీతం విడుదల

Faria Abdullah: తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా గాయపడ సింహం నుంచి బ్రైడ్ సాంగ్

సై ఫై థ్రిల్లర్ మూవీ కిల్లర్ నుంచి డా. పూర్వజ్ ఫస్ట్ లుక్

ఏ మతాన్ని తక్కువ చూపించలేదు : టొవినో థామస్- కెరీర్ లో స్పెషల్ మూవీ: కయదు లోహర్

King 100: నాగార్జున, టబు కాంబినేషన్ లో కింగ్ 100 చిత్రం షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జింజిర్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

ఎడిసన్ టౌన్‌షిప్‌లో నాట్స్ ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్: ప్రజా భద్రతపై అవగాహన సదస్సు

రాత్రి నిద్రకు ముందు తినకూడని ఆహార పదార్థాలు ఏమిటి?

టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు ఏమేమి తినకూడదు?

అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్-తమిళనాడు చాప్టర్ భాగస్వామ్యం

తర్వాతి కథనం
Show comments