Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

01-07-2021 గురువారం దినఫలాలు - సాయిబాబాను ఆరాధించినా...

Advertiesment
01-07-2021 గురువారం దినఫలాలు - సాయిబాబాను ఆరాధించినా...
, గురువారం, 1 జులై 2021 (04:00 IST)
మేషం : ఉద్యోగస్తులకు ఓర్పు చాలా అవసరం. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయక సత్‌కాలంను సద్వినియోగం చేసుకోండి. స్త్రీలు ప్రముఖుల సిఫార్సుతో దైవదర్శనాలను త్వరగా ముగించుకుంటారు. వృత్తుల వారి శ్రమకు తగిన ప్రతిఫలం లభించదు. విదేశీయానం కోసం చేసే యత్నాలు మందకొడిగా సాగుతాయి. 
 
వృషభం : భాగస్వామిక వ్యవహారాలు, ఆర్థిక లాదాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. ఖర్చులు అధికమవుతాయి. ప్రయాణాలు బ్యాంకింగ్ పనులలో అప్రమత్తంగా మెలగండి. దైవ, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వృత్తి పనులు కారణంగా కుటుంబ సభ్యులకు ఇచ్చిన వాగ్దానాలు నిలుపుకోలేకపోతారు. 
 
మిథునం : పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి అనుకూలం. దూర ప్రయాణాలు వాయిదాపడతాయి. ప్రతి విషయంలోనూ స్వయం కృషిపైనే ఆధారపడటం మంచింది. మీ సంతానం చదువుల విషయంలో సంతృప్తి కానవస్తుంది. ఉద్యోగస్తులు అధిక శ్రమకు ఒత్తిడికి లోనవుతారు. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు గడిస్తారు 
 
కర్కాటకం : స్త్రీలకు తల, కాళ్లు నరాలకు సంబంధించిన చికాకులు అధికంగా ఉంటాయి. ప్రణాళికా బద్ధంగా వ్యవహిరిస్తే రాజకీయ కళారంగాలకు చెందిన వారు లక్ష్యాలు సాధిస్తారు. స్పెక్యులేషన్, ఎలక్ట్రానికల్, ఎలక్ట్రికల్ రంగాల వారికి కలిసివచ్చును. ఉమ్మడి నిధుల నిర్వహణలో ఆచితూచి వ్యవహరించండి. 
 
సింహం : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారికి అనుకూలం. ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేకపోతారు. వృత్తులవారు ఎంత శ్రమించినా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆకస్మిక ఖర్చులు మీ ఆర్థిక స్థితికి ఆటంకంగా నిలుస్తాయి. కొబ్బరి, పండ్లు, పూలు వ్యాపారులకు లాభదాకయం. 
 
కన్య : ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి అవకాశాలు లభిస్తాయి. కుటుంబీకుల మధ్య మనస్పర్థలు వస్తాయి. సినిమా రంగాల్లో వారికి సంతృప్తి కానవస్తుంది. ఇంజనీరింగ్, వైద్య రంగాలపట్ల ఆసక్తి పెరుగును. సిమెంట్, ఇసుకు, ఇటుకు తాపి పనివారికి అభివృద్ధి. క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
తుల : రవాణా రంగాలలో వారికి సామాన్యంగా ఉంటుంది. కాంట్రాక్టర్లకు ఎప్పటి నుంచో ఆగివున్న పనులు పునఃప్రారంభమవుతాయి. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడుతాయ. పూర్వ పరిచయ వ్యక్తుల కలయిక సంతృప్తినిస్తుంది. అన్ని రంగాలలోని స్త్రీలకు చాలా యోగ ప్రదంగా ఉండగలదు. 
 
వృశ్చికం : కళంకారీ రంగాలలో వారికి అభిమాన బృందాలు  పెరుగుతాయి. విదేశాలు వెళ్లుటకు చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్టాకిస్టులకు, బ్రోకర్లకు, ఏజెంట్లకు అనుకూలం. స్టేషనరీ రంగాలలో వారికి నిరుత్సాహం. ప్రచురణ, పత్రికా రంగంలోని వారికి మందకొడిగా ఉండగలదు. ఆధ్యాత్మిక చింత పెరుగుతుంది. 
 
ధనస్సు : పట్టువిడుపు ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి. ఐరన్, ఆల్కహాల్ వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితం. ఉద్యోగస్తులకు ప్రమోషన్, ఇంక్రిమెంట్ వంటి శుభవార్తలు అందుతాయి. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. 
 
మకరం : వస్త్ర, వెండి, బంగారం వ్యాపారస్తులకు పనివారితో చికాకులు తప్పవు. బంధు వర్గాలతో గృహంలో సందడి నెలకొంటుంది. రావలసిన ధనం అందడంతో తనాఖా పెట్టిన వస్తువులు విడిపించుకుంటారు. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. మీ సంతానం పై చదువుల కోసం విదేశీ యత్నాలు వాయిదాపడతాయి. 
 
కుంభం : ఆర్థిక లావాదేవీలు అనుకున్న విధంగా లాభిస్తాయి. వ్యాపార విషయముల యందు ఉమ్మడి సమస్యలు తలెత్తవచ్చు. వైద్యులు ఆపరేషన్లు విజయవంతంగా పూర్తిచేస్తారు. మీ అభిరుచి ఆశయాలకు తిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. 
 
మీనం : రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు. ఉద్యోగస్థులు అధికారులకు విలువైన కానుకలు అందజేసి వారిని ప్రసన్నం చేసుకుంటారు. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించుట వల్ల అస్వస్థతకు లోనవుతారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సర్వ దర్శనానికి మోక్షమెప్పుడో... గత 79 రోజులుగా దర్శనభాగ్యం కరువాయే..