Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త హత్య వార్త తెలియగానే ఇంట్లోకెళ్లి భార్య ఆత్మహత్య!

Webdunia
గురువారం, 15 ఏప్రియల్ 2021 (14:37 IST)
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన పెళ్లి చేసుకున్న భర్త హత్యకు గురయ్యాడన్న వార్త తెలియగానే భార్య కూడా ఇంట్లోకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన ఒంగోలులో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలన పరిశీలిస్తే, ఒంగోలుకు చెందిన కబాలి నాగరాజు(26), మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడుకు చెందిన శ్రీవల్లి(21) మూడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 
 
ఒంగోలులోని హిల్‌కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. నాగరాజు ఆటోడ్రైవర్‌గా.. శ్రీవల్లి వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నారు. ఇటీవల వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. నాగరాజుపై శ్రీవల్లి దిశ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
 
నాగరాజు తమ అద్దె ఇంటికి సమీపంలోని తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి అక్కడే ఉంటున్నారు. శ్రీవల్లి మాత్రం అద్దె ఇంటిలోనే నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం టంగుటూరు మండలం మర్లపాడు దగ్గర చెరువులో ఓ మృతదేహం లభ్యమైంది. తల వెనుక భాగంలో, గొంతుపై గాయాలున్నాయి.
 
 
మృతుడి దగ్గర లభ్యమైన చరవాణి ఆధారంగా నాగరాజుగా గుర్తించారు. నాగరాజు హత్యకు గురైనట్లు పోలీసులు శ్రీవల్లికి ఫోన్‌ చేసి చెప్పారు. అప్పటికే గర్భిణి అయిన తన రెండో కుమార్తెను ఆసుపత్రిలో చూపించేందుకు శ్రీవల్లి తల్లి రమాదేవి ఒంగోలు వచ్చారు. 
 
నాగరాజు హత్య విషయం తెలిసి ఇద్దరూ శ్రీవల్లి ఉంటున్న ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో సింగరాయకొండ సర్కిల్‌ నుంచి ఒక ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చి విచారణ నిమిత్తం స్టేషన్‌కు రావాలని శ్రీవల్లిని కోరారు. 
 
డబ్బు తీసుకుని వస్తానని పోలీసులతో చెప్పి గదిలోకి వెళ్లిన శ్రీవల్లి ఎంతసేపటికీ బయటకు రాలేదు. రమాదేవి లోపలికి వెళ్లేసరికి ఉరికి వేలాడుతూ కనిపించారు. శ్రీవల్లి మృతిపై ఒంగోలు ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. హత్య, ఆత్మహత్యలకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి నూతన విధానం

Gowtam: మహేష్ బాబు కుమారుడు గౌతమ్ నటుడిగా కసరత్తు చేస్తున్నాడు (video)

Sapthagiri: హీరో సప్తగిరి నటించిన పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

తర్వాతి కథనం
Show comments