Webdunia - Bharat's app for daily news and videos

Install App

మతి స్థిమితం లేని వృద్ధురాలి దారుణ హత్య.. ముక్కలు ముక్కలుగా నరికి?

Webdunia
మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (22:36 IST)
మతి స్థిమితం లేని ఓ గిరిజన వృద్ధురాలిని దారుణంగా హత్య చేశారు. ఆమెను ముక్కలు ముక్కలుగా నరికి హత్య చేసిన విషాద సంఘటన మంగళవారం జిల్లాలోని గార్ల మండలంలో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే.. మంగళవారం గార్ల మండల శివారులోని డబ్బాల మోరి వద్ద దిగువ రైల్వే ట్రాక్‌ మధ్యలో ఉదయం సుమారు 65 ఏళ్లున్న వృద్ధురాలి మృతదేహం ముక్కలుముక్కలుగా పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
 
ఘటనపై పోలీసులు ఆరా తీసి ఆమెను ఖమ్మం జిల్లా కారేపల్లి(సింగరేణి) మండల పరిధి బద్యాతండావాసిగా గుర్తించారు. కాగా మృతురాలు తనను కుమారులు పట్టించుకోవడం లేదని, తనది కారెపల్లి అని చెబుతూ మూడు రోజులుగా ట్రాక్‌ వెంట తిరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి 11-12గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చంపి, శరీర భాగాలను ముక్కలుగా చేసి గోనె సంచిలో మొండెం భాగాన్ని తెచ్చి ట్రాక్‌ మధ్యలో వదిలి వెళ్లారు.
 
మృతురాలికి ముగ్గురు కుమారులుండగా భర్త ఇదివరకే చనిపోయాడు. రైల్వే డీఎస్పీ చంద్రభాను, ఖమ్మం రైల్వే ఎస్సై రవికుమార్‌ ఆదేశాల మేరకు డోర్నకల్‌ రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ ఆళ్ల సత్యనారాయణరెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

C Kalyan : నిర్మాత సీ కళ్యాణ్ తో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు సమావేశం - రేపు తుది తీర్పు

ఎలాంటి పాత్రను ఇచ్చినా చేయడానికి సిద్ధం : నటుడు ప్రవీణ్‌

యాక్షన్ డ్రామా డేవిడ్ రెడ్డి తో మంచు మనోజ్ అనౌన్స్‌మెంట్

అది నా పూర్వజన్మ సుకృతం : మెగాస్టార్ చిరంజీవి

వార్ 2 కోసం కజ్రా రే, ధూమ్ 3 మ్యూజిక్ స్ట్రాటజీ వాడుతున్న ఆదిత్య చోప్రా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

తర్వాతి కథనం
Show comments