తెలంగాణలో మినీ మున్సిపల్ ఎన్నికలపై ఎస్ఈసీ సమీక్ష నిర్వహించింది. ఎక్సైజ్ అధికారులతో ఎస్ఈసీ పార్థసారధి సమీక్షించారు. 2021, ఏప్రిల్ 30వ తేదీన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగనున్న సంగతి తెలిసిందే.
పోలింగ్‌కు 48 గంటల ముందు.. కౌంటింగ్ ముందు, కౌంటింగ్ రోజు.. బెల్ట్ షాపులు, మద్యం దుకాణాలు తెరొవద్దని ఎస్ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు వ్యక్తుల వద్ద అనుమతికి మించి మద్యం ఉండరాదని ఆదేశాలు జారీ చేసింది.
50 శాతానికి మించి మద్యం అమ్మకాలు జరిగితే.. ప్రత్యేక నిఘా పెట్టాలని పార్థసారధి సూచించారు. ప్రత్యేక చెక్ పోస్టులు పెట్టి.. అక్రమ మద్యం రవాణాను నివారించాలన్నారు.
పోలీసులతో సమన్వయం చేసుకుని నిబంధనలను అమలు చేయాలన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజిగూడ ఉప ఎన్నికపైనా కూడా ఆయన సమీక్షించారు. ఉప ఎన్నిక సజావుగా జరిగేందుకు ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.