వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో దారుణ ఘటన.. రోగిని వీపుపై మోసుకెళ్లాడు..

Webdunia
శనివారం, 13 మే 2023 (11:09 IST)
Warrangal
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. రోగుల పట్ల ఆసుపత్రి సిబ్బంది ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో వైద్యం పొందే ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. తాజాగా ఈ ఆసుపత్రి సిబ్బంది స్ట్రెచర్ ఇవ్వడానికి నిరాకరించడంతో ఒక వ్యక్తి తన భార్యను తన వీపుపై మోశాడు ఓ వ్యక్తి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
లక్ష్మి అనే మహిళకు నెల రోజుల కిందటే శస్త్ర చికిత్స జరగడంతోపాటు తదుపరి పరీక్షలు చేయాల్సి రావడంతో దంపతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఆస్పత్రికి వచ్చారు. అయితే, ఆసుపత్రికి చేరుకోగా, ఆ రోజు వైద్యులు అందుబాటులో లేరని, మరుసటి రోజు రావాలని కోరారు. 
 
నడవలేని స్థితిలో ఉన్న తన భార్యను ఆసుపత్రి నుంచి బయటకు తీసుకెళ్లేందుకు భర్త స్ట్రెచర్‌ను కోరాడు. అయితే, ఆసుపత్రి సిబ్బంది దానిని అందించడానికి నిరాకరించారు. దీంతో భార్యను తన భుజాలపై మోసుకెళ్ళాడు ఆ వ్యక్తి. రోగుల పట్ల ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి ఈ ఘటన అద్దం పట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika Nair: శర్వా.. బైకర్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ థియేటర్లలో స్క్రీనింగ్

Thaman: బాలకృష్ణ.. అఖండ 2: తాండవం బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

Dulquer : దుల్కర్ సల్మాన్.. కాంత నుంచి రాప్ ఆంథమ్ రేజ్ ఆఫ్ కాంత రిలీజ్

Rashmika: ది గర్ల్ ఫ్రెండ్ లో రశ్మికను రియలిస్టిక్ గా చూపించా : రాహుల్ రవీంద్రన్

Bhumi Shetty: ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్ తో రాబోతున్న మహాకాళి చిత్రంలో భూమి శెట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments