Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాస పవర్ ముందే కనిపెట్టిన జూ.ఎన్టీఆర్-కల్యాణ్ రామ్... అందుకే...

Webdunia
బుధవారం, 12 డిశెంబరు 2018 (10:51 IST)
కూకట్ పల్లి. ఆంధ్రులు ఎక్కువగా వుండే ప్రాంతమది. అందుకే తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆ స్థానాన్ని హరికృష్ణ కుమార్తె సుహాసినికి ఇప్పించి బరిలో దింపారు. కానీ సుహాసిని ఈ ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలయ్యారు. సుహాసిని గెలుపు కోసం అటు బాలయ్య ఇటు చంద్రబాబు నాయుడు చాలా కృషి చేశారు. ఆమెను వెంటబెట్టుకుని ప్రచారం కూడా నిర్వహించారు. కానీ ఓటర్లు మాత్రం తెరాస వైపు మొగ్గారు. దీనితో సుహాసినికి పరాజయం తప్పలేదు. 
 
ఇకపోతే అక్కయ్య సుహాసిని కోసం జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ప్రచారం చేస్తారని అంతా అనుకున్నారు. కానీ వారిద్దరూ ప్రచారం చేయలేదు. దీనిపై ఎంతోమంది విమర్శనాస్త్రాలు సంధించినా పట్టించుకోలేదు. ఇలా చేసి తెలివిగా వ్యవహరించారని ఇప్పుడు అంతా అనకుంటున్నారు. అలా కాకుండా తెరాసకు వ్యతిరేకంగా వారు ప్రచారం చేసి వున్నట్లయితే కేసీఆర్ వ్యతిరేకులుగా ముద్రపడాల్సి వచ్చేది. ఇప్పుడా ఇబ్బంది లేకుండా అయింది. మొత్తమ్మీద తెలంగాణలో తెరాస గాలి వీస్తోందని జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ పసిగట్టేశారని చెప్పుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments