Publish Date: Tue, 11 Dec 2018 (16:25 IST)
Updated Date: Tue, 11 Dec 2018 (16:26 IST)
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన తాజా చిత్రం కవచం. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు శ్రీనివాస్ తెరకెక్కించారు. పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ స్టోరీ అయిన కవచం సినిమాపై బెల్లంకొండ చాలా ఆశలు పెట్టుకున్నాడు. కాజల్ అగర్వాల్, మెహ్రీన్, చోటా కే నాయుడు... ఇలా భారీ తారాగణం, సాంకేతిక నిపుణలతో రూపొందిన కవచం సినిమా ఖచ్చితంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి విజయాన్ని అందిస్తుంది అనుకున్నారు కానీ.. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే ఈ సినిమా డిజాస్టర్ టాక్ దక్కించుకుంది.
అసలు విషయం ఏంటంటే... ఈ సినిమా కథ ముందుగా కళ్యాణ్ రామ్ దగ్గరకి వెళ్లిందట. అయితే.. కళ్యాణ్ రామ్ పటాస్ సినిమాలో పోలీసాఫీసర్‌గా చేసుండటం వలన అనుకుంటా నో చెప్పేసాడట. ఆ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ దగ్గరకి వెళితే ఇప్పటివరకు పోలీసాఫీసర్‌గా చేయకపోవడంతో అనుకుంటా వెంటనే ఓకే చెప్పాడట. ఒక రకంగా కళ్యాణ్ రామ్ తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. ఫ్లాప్ మూవీ నుంచి తప్పించుకున్నాడు.