Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రముఖ ఆర్థికవేత్త బీపీఆర్‌ విఠల్ మృతి

Webdunia
శుక్రవారం, 19 జూన్ 2020 (20:07 IST)
మాజీ ఐఏఎస్‌ అధికారి, ప్రముఖ ఆర్థికవేత్త బీపీఆర్‌ విఠల్ (93) మృతి పట్ల రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం తెలిపారు. బీపీఆర్‌ విఠల్‌ శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూశారు.

ఆయన కుటుంబసభ్యులకు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు,ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో అతి ఎక్కువ కాలం పాటు ఆర్థిక, ప్రణాళిక శాఖల కార్యదర్శిగా, ఏపీ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ బోర్డు వైస్ చైర్మన్‌గా, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) సలహాదారుడిగా, పదవ ఆర్థిక కమిషన్ సభ్యుడిగా విఠల్ అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు.

బీపీఆర్‌ విఠల్‌కు భార్య శేషు, కుమార్తె నివేదిత కుమార్‌, కుమారులు సంజయ్‌ బారు, చైతన్య బారు ఉన్నారు. కాగా మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు సంజయ్‌ బారు మీడియా సలహాదారుగా వ్యవహరించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments