Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా బాధిత ఎమ్మెల్యే పోలింగ్ బూత్ కు వచ్చి ఓటేశాడు, ఎవరు? ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 19 జూన్ 2020 (20:04 IST)
ఓటుకు రాజకీయ పార్టీలు ఎంత ప్రాముఖ్యత ఇస్తాయో, సీటు కోసం ఎంతకు దిగజారి వ్యవహరిస్తాయో తెలిపే సంఘటన ఇది. కరోనా రోగి వున్నట్లు తెలియగానే పోలీసులతో నానా హడావుడి చేసే నేతలు.. మధ్యప్రదేశ్ లో ఏకంగా పోలింగ్ బూత్ కు రప్పించి మరీ ఓటేయించారు.

వివరాల్లోకి వెళితే..మధ్యప్రదేశ్‌లో మూడు రాజ్యసభ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరుగుతుండగా అప్పటికే 205 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇంతలో అంబులెన్స్‌ నుంచి ఒక వ్యక్తి దిగారు. అరికాలు నుండి పైన తలవెంట్రుకల వరకు మొత్తం పిపిఇ కిట్‌తో కప్పేసి ఉన్నాడు.

చేతిలో సెల్‌ఫోన్‌ పట్టుకొని వడివడిగా ఎన్నికల బూత్‌ వైపు నడిచాడు. అధికారులతో మాట్లాడి ఓటేశాడు. అతనే కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కునాల్‌ చౌదరి. జూన్‌ ఐదో తేదీన అనారోగ్యం పాలయిన కునాల్‌కు జూన్‌ 12వ తేదీ నాటికి కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యింది. అప్పటి నుంచి హాస్పిటల్లో చికిత్స చేయించుకుంటున్నాడు.

ఇంతలో రాజ్యసభ ఎన్నికలు రావడంతో ఇలా పూర్తిగా సురక్షిత సూట్‌లో ఎవరికి ఇబ్బంది కల్గించకుండా వచ్చి ఓటు వేశాడు. ఆయన ఓటు వేయడానికి వచ్చినప్పుడు అందరూ చాలా దూరంగా జరిగారు. అయితే కరోనా పాజిటివ్‌ వ్యక్తిని ఓటింగ్‌కు ఎలా అంగీకరిస్తారని ఎన్నికల సంఘాన్ని బిజెపి హితేష్‌ బాజ్‌పాయి ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

తర్వాతి కథనం
Show comments