నాయిని మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు: కేసీఆర్

Webdunia
గురువారం, 22 అక్టోబరు 2020 (09:34 IST)
కార్మిక నాయకుడు, తెలంగాణ ఉద్యమ నేత, మాజీ మంత్రి శ్రీ నాయని నరసింహా రెడ్డి ఇక లేరు. అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి బుధవారం రాత్రి 12:25కు తుది శ్వాస విడిచారు. నాయిని మరణం టీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ సమాజానికి తీరని లోటని ముఖ్య మంత్రి కెసిఆర్ తన సంతాపం ప్రకటించారు.
 
ఐదు దశాబ్దాలుగా ప్రజల మనిషిగా ఆయన రాజకీయాల్లో, కార్మిక నేతగా పనిచేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో, 2001 నుండి మలిదశ తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర అనన్యసామాన్యమని పలువురు మంత్రులు కొనియాడారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మూడు సార్లు అసెంబ్లీకి ఎన్నికయిన నాయిని వైయస్ కేబినెట్లో మంత్రిగా, తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ క్యాబినెట్లో హోం మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. కార్మిక సంఘ నాయకుడిగా నాయిని నర్సింహారెడ్డి అందరికి సుపరిచితులు.
 
నల్గొండ జిల్లాకు చెందిన నాయిని 1960వ దశకంలో హైదరాబాద్ వచ్చి కార్మికుల హక్కుల పోరాటంతో కార్మిక నాయకుడిగా ఎదిగారు. 1978లో మొదటిసారి ఎమ్మెల్యేగా 1985, 2004లో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ అసెంబ్లీకి ఎమ్మెల్యేగా, 2009లో తెలంగాణా నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

Ratika: రతిక ప్రధాన పాత్రలో ఎక్స్ వై డిఫరెంట్ పోస్టర్‌

Spirit : ప్రభాస్.. స్పిరిట్ నుంచి సౌండ్ స్టోరీ ప్రోమో - రవితేజ, త్రివిక్రమ్ వారసులు ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments